Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ హైదరాబాద్-2 రీజినల్ ఆఫీసు ఎంజె మార్కెట్ సమీపంలో మెగా రిటైల్ ఎక్స్పోను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. బుధవారం కెనరా బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ ఆఫీసు జనరల్ మేనేజర్ అనురాధ ప్రారంభించి.. ఆ బ్యాంక్ అందిస్తున్న పథకాలు, బ్యాంకింగ్ సేవల గురించి వివరించారు. ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా పోటీ వడ్డీ రేట్లతో గృహ, వాహన, కుదువ రుణాలను అందిస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.2,000 కోట్ల రిటైల్ రుణాలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. విదేశీ విద్యా రుణాల జారీలోనూ ముందున్నామన్నారు. ఇక్కడ జరిగిన ఎక్స్పోలో పలువురు గృహ, వాహన, విద్యా రుణ గ్రహీతలకు ఆమె చెక్కులను అందజేశారు.