Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ వ్యాప్తంగా 6,762 రిటెయిల్ శాఖలు
నవతెలంగాణ హైదరాబాద్ : హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారతదేశ వ్యాప్తంగా 100 కొత్త శాఖలను ప్రారంభించానని ప్రకటించింది. ఈ కొత్త శాఖలు 15 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 83 నగరాలు/పట్టణాలలో ప్రారంభించింది. ఈ శాఖలు సుమారుగా 50% మేర చిన్న నగరాలు, మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. కొత్త శాఖలకు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ శశిధర్ జగదీశన్ డిజిటల్ విధానంలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్లోని సీనియరు బ్యాంకు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొత్త శాఖల ప్రారంభం గురించి హెచ్డీఎఫ్సీ బ్యాంకు రిటెయిల్ బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూపు హెడ్ అరవింద్ వోహ్రా మాట్లాడుతూ, ‘‘మా వినియోగదారులకు భౌతిక శాఖల కేంద్రాలు మరియు డిజిటల్ బ్యాంకింగ్ సేవల సంయోజన ద్వారా మా వినియోగదారులకు సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నాము. మేము రానున్న నెలలలో మరిన్ని ఎక్కువ శాఖలను ప్రారంభించడాన్ని కొనసాగించడం ద్వారా నాణ్యతతో కూడిన బ్యాంకింగ్ ఉత్పత్తులను మరియు సేవలను దేశ వ్యాప్తంగా లభించేలా చేయనున్నాము’’ అని పేర్కొన్నారు.
బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 425 రిటెయిల్ శాఖలు మరియు నాలుగు డిజిటల్ బ్యాంకింగ్ కేంద్రాలను ప్రారంభించింది. డిసెంబరు 15, 2022 చివరికి బ్యాంకు వితరణ నెట్వర్కులో 6,762 రిటెయిల్ శాఖలు, నాలుగు డిజిటల్ బ్యాంకింగ్ కేంద్రాలు మరియు 17,076 ఏటీఎంలను 3,279 నగరాలు/పట్టణాలలో విస్తరించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు వితరణ నెట్వర్క్ను విస్తరించగా, తన లావాదేవీల పరిధిలో ప్రగతికి మద్దతు ఇచ్చే మరియు దేశ వ్యాప్తంగా తన వినియోగదారులకు సేవలు అందించేందుకు మద్దతు ఇస్తోంది. హెచ్డీఎఫ్సి బ్యాంకు 2021లో బ్యాంకు తదుపరి ప్రగతి అలకు శక్తి నింపేందుకు సంఘటన మార్పులను ‘ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ’లో భాగంగా ఆవిష్కరించింది. బ్యాంకు తన ప్రణాళిక వ్యూహాలను మూడు ప్రముఖ వలయాలలో బలోపేతం చేసింది. అవి, ఎ) బిజినెస్ వర్టికల్స్, 2) డెలివరీ ఛానెల్స్, సి) టెక్నాలజీ/ డిజిటల్. తన శాఖల నెట్వర్కును కొనసాగిస్తే, విస్తరణ ద్వారా బ్యాంకుకు వినియోగదారులకు సంబంధించిన అన్ని వలయాలలో అవకాశాలను వినియోగించుకునేలా మద్దతు ఇస్తోంది.