Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫోర్టిస్ ఆసుపత్రి, కోల్కతా, మూత్ర మార్గపు యొక్క ముదిరిపోయిన క్షయ (టీబీ) వ్యాధితో బాధపడుతున్న ఒక రోగిపై ఇండియా యొక్క మొట్టమొదటి కిడ్నీ ట్యూబ్ (యురేటర్) మరియు యూరినరీ బ్లాడర్ (ఇలియల్ యురేటర్ తో ల్యాపరాస్కోపిక్ ఆగుమెంటేషన్ క్జ్రిస్టోప్లాస్టీ) ల్యాపరాస్కోపిక్ పునర్నిర్మాణమును విజయవంతంగా నిర్వహించింది. డాక్టర్ ఆర్.కె. గోపాలక్రిష్ణ, ల్యాపరాస్కోపిక్ యూరోసర్జన్, ఫోర్టిస్ కోల్కతా అతని బృందముతో పాటుగా ఒక 48- సంవత్సరాల రోగిపై అత్యంత జటిలమైన మరియు సవాలుతో కూడిన ఈ శస్త్రచికిత్సను నిర్వర్తించారు. అందుబాటులోని వైద్య రికార్డుల ప్రకారము, ఇది ఇండియాలో నిర్వర్తించబడిన ఈ రకమైన మొట్టమొదటి శస్త్రచికిత్సగా నమోదయింది.
దుర్గాపూర్ నివాసితుడైన రోగి శ్రీ ఆషిమ్ కుమార్ సాహా, ఫోర్టిస్ కోల్కతాలో గడచిన ఆరు నెలల నుండీ మూత్ర మార్గము యొక్క ముదిరిపోయిన క్షయ వ్యాధి కోసం చికిత్స చేయించుకుంటున్నారు. వ్యాధి అతని కిడ్నీలు, యూరినరీ బ్లాడర్ (మూత్ర సంచీ) మరియు యురేటర్ లకు సోకి కిడ్నీలు దెబ్బతిన్నాయి, అవి రేగిపోయి కుదించుకుపోయాయి, అలా ఎడమ కిడ్నీ పూర్తిగా మూసుకుపోయేందుకు దారితీసింది. మూత్రసంచీ (బ్లాడర్) యొక్క మామూలు సామర్థ్యము సుమారు 400 మి.లీ నుండి 500 మి.లీ కాగా, అతని యూరినరీ బ్లాడర్ కుదించుకుపోయి 150 మి.లీ సామర్థ్యమునే కలిగి ఉంది, అది ఒరిజినల్ సైజులో సుమారు⅓ మాత్రమే ఉంది. రోగి రాత్రి వేళల్లో తరచుగా - దాదాపుగా ఎనిమిది సార్లు మూత్రవిసర్జనకు వెళుతుండగా, అతనికి మూత్ర విసర్జన బాధాకరంగా ఉండటంతో పాటుగా చాలా కష్టంగా కూడా ఉండేది. అతని ఎడమ కిడ్నీ ట్యూబు పూర్తిగా మూసుకుపోయింది, మరియు కుడి కిడ్నీ మాత్రమే మామూలుగా పనిచేస్తూ ఉండినది. ఇంతకు మునుపు, ఇటువంటి పరిస్థితిలో యురేటర్ మరియు బ్లాడరును పునర్నిర్మాణము చేయునప్పుడు, డాక్టర్లు ఇంతవరకూ ఓపెన్ సర్జరీ అనే సాంప్రదాయక పద్ధతినే అవలంబిస్తూ ఉండేవారు, అది కఠినమైన మరియు కీలకమైన పునర్నిర్మాణముగా ఉండేది. అయినప్పటికీ, ఫోర్టిస్ కోల్కతా వద్ద డాక్టర్లు ల్యాప్రాస్కోపీ అనే కనీస కోత ఉండే పద్ధతిని చేపట్టడం ద్వారా ఒక నూతన పద్ధతిని అవలంబించారు.
డాక్టర్ ఆర్.కె. గోపాలక్రిష్ణ, ల్యాపరాస్కోపిక్ యూరోసర్జన్, ఫోర్టిస్ కోల్కతా, ఆనందపూర్ వారి ప్రకారము, “రోగి విపరీతమైన బాధతో ఉన్నారు మరియు ప్రతి రోజూ గడిచే కొద్దీ అతని పరిస్థితి మరింత క్షీణించిపోతూ ఉండేది. మూత్రసంచీ (బ్లాడర్) మరియు పాడైపోయిన ఎడమ కిడ్నీ యొక్క మామూలు సామర్థ్యమును కూడా పునరుద్ధరించడానికి యూరినరీ బ్లాడర్ ల్యాపరాస్కోపిక్ పునర్నిర్మాణము మాత్రమే ఏకైక ఐచ్ఛికముగా ఉండినది. సాధారణంగా, పొత్తికడుపులో ఒక పెద్ద కోతను ఇమిడి ఉండే ఓపెన్ శస్త్రచికిత్సలు నిర్వర్తించడం ద్వారా ఈ రకమైన పునర్నిర్మాణము చేయబడుతుంది, మరియు రోగి ఒక వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండవలసి వస్తుంది. ఈ ప్రత్యేకమైన ఉదంతములో, పొత్తికడుపులో కేవలం నాలుగు చిన్న రంధ్రాలు చేసి శస్త్రచికిత్స పూర్తిగా ల్యాప్రాస్కోపీతోనే చేయబడింది. మూత్ర మార్గం యొక్క పునర్నిర్మాణము అనే చికిత్సకు ఇది మొదటి కేసు కానప్పటికీ, ఇది ల్యాప్రాస్కోపీతోనే చేయబడినట్టి మొట్టమొదటి ఉదంతముగా ఉంది. అంతే కాకుండా సాంప్రదాయక పద్ధతిలో, ప్రేవులను కుట్టడానికి ఒక స్టేప్లర్ పరికరము ఉపయోగించబడుతుంది, అయితే ఇక్కడ మేము కుట్టులను ఉపయోగించి ప్రేవుల్ని సూదితో చేతితో-కుట్లు వేశాము. మళ్ళీ ఇది స్టేప్లర్లు ఉపయోగించకుండా, స్టేప్లర్ల ఖర్చును తొలగించుకుంటూ చేసిన మొట్టమొదటి చర్య కూడా అయింది. ఓపెన్ సర్జరీతో పోల్చి చూసినట్లయితే, ల్యాప్రాస్కోపీ శస్త్రచికిత్స అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఓపెన్ సర్జరీలో అనేక ముప్పులు ఇమిడి ఉంటాయి - పెద్ద కుట్లు వేసినందువల్ల నొప్పి, నిదానంగా కోలుకోవడం మరియు ఆపరేషన్-అనంతర దశలో హెర్నియా వచ్చే అవకాశాలు ఉంటాయి. ల్యాప్రాస్కోపీ శస్త్రచికిత్స రోబోటిక్ సర్జరీని పోలి ఉంటుంది అయితే తక్కువ ఖరీదైనదిగా ఉంటుంది.
రోగి ఆషిమ్ కుమార్ సాహా ఇలా అన్నారు “నేను వృత్తిరీత్యా ఆటోరిక్షా నడుపుకుంటూ ఉంటాను. క్షయ వ్యాధి నా మూత్రసంచీ సైజును తగ్గించివేసింది మరియు ఒక కిడ్నీని పాక్షికంగా పాడు చేసింది; నాకు ఎంతో ఎక్కువ నొప్పిగా ఉండినది మరియు తరచుగా మూత్రవిసర్జనకు వెళ్ళవలసి వచ్చేది, అది నా పని మరియు ఆదాయాన్ని దెబ్బతీసింది. వేగంగా కోలుకోవడం మరియు నొప్పి తక్కువగా ఉండడం కోసం ఫోర్టిస్ ఆసుపత్రి లోని డాక్టర్లు ల్యాపరాస్కోపిక్ పునర్నిర్మాణ చికిత్స కోసం సలహా ఇచ్చారు. ఇప్పుడు శస్త్రచికిత్స జరిగిన అనంతరం, నా బ్లాడర్ (మూత్రసంచీ) సామర్థ్యం పెరిగింది, నేను తరచుగా మూత్రవిసర్జనకు వెళ్ళడం లేదు” అన్నారు.