Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అసుస్ ఇండియా, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ROG) నేడు అసుస్ గేమింగ్ డే సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా ఉత్సాహపూరితమైన ఆఫర్లను మొత్తం గేమింగ్ పీసీ పోర్ట్‌ఫోలియోపై అందిస్తుంది. ఈ ఆఫర్ అసుస్ ఈ–షాప్ ; అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు మరియు ROG స్టోర్ల వద్ద లభ్యమవుతుంది. డిసెంబర్ 19 నుంచి 23 డిసెంబర్ 2022 మధ్య కాలంలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు అత్యంత ఉత్సాహపూరితమైన రాయితీలను తాజా ROG ల్యాప్‌టాప్‌లపై కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లో భాగంగా రాయితీ ధరలో వారెంటీ ఎక్స్‌టెన్షన్‌ను అన్ని గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై పొందడం ; నో కాస్ట్ ఈఎంఐ వంటివి సైతం పొందవచ్చు. సంవత్సరాంతపు వేడుకలకు మరింత సంతోషాన్ని జోడిస్తూ మొదటి 100 మంది వినియోగదారులు ఎవరైతే asuspromo.in వద్ద నమోదు చేసుకుంటారో వారు 4500 రూపాయల విలువ కలిగిన ROG గేమింగ్ మౌస్‌ను పూర్తి ఉచితంగా G513IE (2021) మరియు G713IE (2021) మోడల్స్ కొనుగోలుపై పొందవచ్చు.
అసుస్ ఆర్ఓజీ శ్రేణిలో గేమింగ్ ల్యాప్‌టాప్‌లను గేమింగ్ అనుభవాలను మరింతగా మెరుగుపరిచే రీతిలో తీర్చిదిద్దారు. ఇవి ఉత్పాదకతను మెరుగుపరచడంతో పాటుగా , వినియోగదారుల కోసం వారి అవసరాలకు తగినట్లుగా వ్యక్తిగతీకరించిన ఎంపికలను అందిస్తాయి. అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దిన ఈ గేమింగ్ మెషీన్లు గేమర్లకు వైవిధ్యతను అందిస్తాయి మరియు గేమ్ ప్లే ను తరువాత దశకు తీసుకువెళ్తాయి. ఈ గేమింగ్ డేస్ సేల్‌లో భాగంగా, వినియోగదారులు 38% వరకూ రాయితీని TUF సిరీస్‌పై అందిస్తుంది. వీటితో పాటుగా ఉత్సాహపూరితమైన రీతిలో 37% రాయితీని సౌకర్యవంతమైనప్పటికీ ప్రభావవంతమైన Zephyrus Series పై , 30% రాయితీని అత్యుత్తమ గేమింగ్ మెషీన్లు – Strix and Scar series పై 33% రాయితీని సౌకర్యవంతమైన మరియు శక్తివంతమైన ROG Flow series పై అందిస్తున్నారు.