Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎన్మిమ్ (NMIM) యొక్క ప్రవీణ్ దలాల్ స్కూల్ ఆఫ్ ఎంటర్ప్రిన్యూర్షిప్ అండ్ ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ (పీడీఎస్ఈ అండ్ ఎఫ్బీ) విద్యార్ధులు బెల్జియం, ఆస్ట్రియా, జర్మనీ మరియు స్విట్జర్లాండ్లను తమ అంతర్జాతీయ స్టడీ ట్రిప్లో భాగంగా సందర్శించారు. అంతర్జాతీయంగా పరిిస్థితులను ఆకలింపు చేసుకోవడంలో విద్యార్ధులకు సహాయపడేందుకు ఈ స్టడీ ట్రిప్ చేశారు. ప్రవీణ్ దలాల్ స్కూల్ ఆఫ్ ఎంటర్ప్రిన్యూర్షిప్ అండ్ ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ నేతృత్వంలో విద్యార్ధులు పలు విజయవంతమైన కంపెనీల టాప్ మేనేజ్మెంట్, ఫౌండర్లు, సీఈఓ లను కలిసే అవకాశం కలిగింది. ప్రొఫెసర్ సీమా మహాజన్ మాట్లాడుతూ ‘‘ ఈ సంవత్సరపు ఇండస్ట్రీయల్ విజిట్ ముఖ్య లక్ష్యం విద్యార్ధులకు గ్లోబల్ బ్రాండ్ పొజిషనింగ్ పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజైన్, ఆవిష్కరణలను తెలపడం, విదేశీ మార్కెట్లలో ఎదురవుతున్న సవాళ్లు , వాటి పరిష్కారాల పట్ల అవగాహన కల్పించడం’’ అని అన్నారు. ‘‘కుటుంబ వ్యాపారాలు కలిగిన వారి ఆలోచనా ధోరణులలో సానుకూల మార్పును మేము చూస్తున్నాము. ఈ తరహా అంతర్జాతీయ ఎక్స్పోజర్తో జెన్ జెడ్ అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను తెలుసుకోగలరు’’ అని అన్నారు. ఈ అంతర్జాతీయ ట్రిప్ నుంచి విద్యార్ధులు ఎక్కువగా తెలుసుకునేలా 12 రోజుల షెడ్యూల్లో 14 సంస్ధలను నాలుగు దేశాలలో కలిసే అవకాశం అందించారు. ఈ సందర్శనలో ఐఎంఈసీ, ష్నిడర్, బీఎండబ్ల్యు, మెర్సిడెస్ –బెంజ్, ఎర్డింగర్ వంటి సంస్ధలకు విద్యార్ధులు వెళ్లారు.