Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం బంఫర్ ఆఫర్ ప్రకటించే యోచనలో ఉంది. పేద, మధ్య తరగతికి చిన్న రాయితీ ఇవ్వడానికి పది సార్లు ఆలోచించే మోడీ సర్కార్.. ఐడీబీఐ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు మాత్రం పన్నులో రాయితీ ఇవ్వాలని భావిస్తోంది. ఈ సంస్థ కొనుగోలుదారులకు పలు పన్ను మినహాయింపులను ఇవ్వాలనే యోచనలో కేంద్రం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ బ్యాంక్ ప్రయివేటీకరణకు వీలుగా బిడ్ల దాఖలకు గాను గడువును జనవరి 7 వరకు దీపమ్ పొడిగించింది. ఇందులో 60.72 శాతం వాటాను విక్రయానికి పెట్టింది.