Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టాటా గ్రూపునకు చెందిన ఎలక్టాన్రిక్స్ రిటైలర్ క్రోమా రాష్ట్రంలో తన కార్యకలాపాలను విస్తరించినట్లు ప్రకటించింది. కొత్తగా మహబూబ్నగర్లో, కరీంనగర్లో నూతన స్టోర్లను తెరిచినట్లు వెల్లడించింది. ఈ స్టోర్లలో 550కు పైగా బ్రాండ్లతో 16వేల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. వ్యవసాయ రంగంలో కీలకంగా ఉన్న మహబూబ్నగర్, గ్రానైట్ పరిశ్రమకు ఖ్యాతి గడించిన కరీంనగర్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వృద్థికి అపార అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.