Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి అథవాలే
- శ్రీను టెక్నాలజీ కంపెనీకి
- ఫాస్టెస్ట్ గ్రోవింగ్ ఇండియన్ కంపెనీ ఎక్స్‌లెన్స్ అవార్డు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలు మరింత ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ఆత్మనిర్మల్ భారత్‌లో భాగంగా న్యూఢిల్లీలో ఇంటర్ నేషనల్ అచీవర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలకు అవార్డ్‌లను అందజేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన శ్రీను టెక్నాలజీ కంపెనీకి ఫాస్టెస్ట్ గ్రోవింగ్ ఇండియన్ కంపెనీ ఎక్స్‌లెన్స్ అవార్డ్ దక్కింది. ఈ అవార్డ్‌ను కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేతుల మీదుగా శ్రీను టెక్నాలజీ ఎం.డి చిల్కా కావ్యశ్రీ అందుకున్నారు. ఈ సదస్సులో కేంద్ర మాజీ మంత్రి కె.జె ఆల్ఫాన్స్, సిక్కీం మాజీ గవర్నర్ బి.సి.సింగ్, మాజీఎంపి జె.కె.జెయిన్, సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది డాక్టర్ జి.వి.రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే మాట్లాడుతూ వ్యాపార రంగంలో యువ దళిత మహిళ రాణిచండం పట్ల చిల్కా కావ్యశ్రీను అభినంధించారు. భవిష్యత్‌లో మరింత ఎదగాలని ఆకాక్షించారు. అనంతరం చిల్కా కావ్యశ్రీ మాట్లాడుతూ నేటి ఆధునీక ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్ అత్యంత ముఖ్యమైన భూమికను పోషిస్తుందన్నారు. తక్కువ కాలంలోనే తమ శ్రీను టెక్నాలజీ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు.