Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ అభిమానుల కోసం ఉత్సాహపూరితమైన ఆఫర్లు ప్రకటన
నవతెలంగాణ వరంగల్: భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే ఆభరణాల బ్రాండ్లలో ఒకటి కావడంతో పాటుగా అగ్రగామి ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ తమ నూతనంగా డిజైన్ చేసిన షోరూమ్‌ను వరంగల్‌లోని జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియం ఎదురుగా, నూతన బస్టాండ్ వద్ద ప్రారంభించింది. ఈ పూర్తి సరికొత్త షో రూమ్ అత్యంత విలాసవంతమైన, పునరుద్ధరించబడిన షాపింగ్ అనుభవాలను వైవిధ్యమైన, ట్రెండీ ఆభరణాల డిజైన్లను ప్రదర్శించడం ద్వారా అందిస్తుంది. కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్, నేటి నుంచి పూర్తి స్ధాయిలో తమ సేవలను వరంగల్ నగర వాసులకు అందిస్తుంది. ఇక్కడ విస్తృత శ్రేణిలో సమకాలీన , సంప్రదాయ ఆభరణాల డిజైన్లు ఉండటంతో పాటుగా విభిన్న అభిరుచులు, ప్రాధాన్యతలు కలిగిన వినియోగదారుల అవసరాలను సైతం తీర్చనుంది.
ఈ నూతన షోరూమ్ ప్రారంభం గురించి కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ ‘‘ వరంగల్‌లో మా నూతనంగా పునరుద్ధరించబడిన షోరూమ్ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ పునరావిష్కరించిన షోరూమ్ వినియోగదారుల విస్తృతశ్రేణి ఆభరణాల అవసరాలను కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క విస్తృత శ్రేణి కలెక్షన్స్, మరీ ముఖ్యంగా వెడ్డింగ్ జ్యువెలరీ లైన్ – ముహూర్త్ ద్వారాతీర్చనుంది. దీనిలో సమకాలీన డిజైన్స్‌తో పాటుగా అతి క్లిష్టమైన, సంప్రదాయ టెంపుల్ జ్యువెలరీ కూడా ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ పై తమ అభిమానం, నిరంతర మద్దతు చూపుతున్న మా వినియోగదారులకు ధన్యవాదములు తెలుపుతున్నాము. మా వినియోగదారులకు అత్యుత్తమమైనది అందిస్తామనే మా వాగ్ధానం నెరవేర్చడంతో పాటుగా రాబోయే కాలంలో నమ్మకం, నిజాయితీ అనే మా విలువలతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించనున్నాము’’అని అన్నారు
వినియోగదారులు ఇప్పుడు కళ్యాణ్ యొక్క నాలుగంచెల భరోసా సర్టిఫికేషన్‌ను బంగారం ఆభరణాలపై పొందగలరు. తమ బ్రాండ్ అభిమానులకు అత్యుత్తమ విలువను అందించాలనే నిబద్ధతను పునరుద్ఘాటించే క్రమంలో కళ్యాణ్ ఆరంభించిన ప్రత్యేక కార్యక్రమమిది. కళ్యాణ్ జ్యువెలర్స్‌లో విక్రయించే ఆభరణాలన్నీ కూడా బహుళ స్వచ్ఛత పరీక్షలను ఎదుర్కొంటాయి మరియు అన్నీ బీఐఎస్ హాల్‌మార్క్ ఆభరణాలు. నాలుగంచెల భరోసా సర్టిఫికెట్ వినియోగదారుల చెల్లింపుకు పూర్తి భరోసాను మార్పిడి లేదా రీసేల్‌పై అందిస్తుంది అంతేకాదు, ఆభరణాలపై ఉచిత జీవితకాలపు మెయిన్టెనెన్స్ను దేశంలోని కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌లలో అందిస్తుంది.
కళ్యాణ్ జ్యువెలర్స్ తమ అభిమానులకు ముహుర్త్, బ్రైడల్ జ్యువెలరీ లైన్‌ను అందిస్తుంది. దీనితో పాటుగా ప్రత్యేకమైన సెక్షన్స్‌లో కళ్యాణ్ యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండ్లు అయినటువంటి తేజస్వి– పోల్కి ఆభరణాలు, ముద్ర – చేతితో రూపొందించిన యాంటిక్ జ్యువెలరీ, నిమాహ్– టెంపుల్ జ్యువెలరీ, గ్లో– డ్యాన్సింగ్ డైమండ్స్, జియా– సోలిటైర్ తరహా వజ్రాభరణాలు, అనోఖీ –అన్‌కట్ డైమండ్స్, అపూర్వ– ప్రత్యేక సందర్భాల కోసం వజ్రాలు, అంతర –వెడ్డింగ్ డైమండ్స్, హీరా డైలీ వేర్ డైమండ్స్ మరియు రంగ్– ప్రెసియస్ స్టోన్ జ్యువెలరీ ఉంటాయి. ఒక లక్షకు పైగా సమకాలీన, సంప్రదాయ డిజైన్స్‌తో కూడిన పోర్ట్‌ఫోలియో నుంచి బ్రైడల్ వేర్, ఫెస్టివ్ వేర్, ప్రతిరోజూ ధరించేందుకు ఆభరణాలను వినియోగదారులు ఎంచుకోవచ్చు.