Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీమ్ సూపర్ ఫుడ్స్‌ను విస్తరణ
హైదరాబాద్ : సుప్రీమ్ సూపర్ ఫుడ్స్‌ను హైదరాబాద్‌లో 600 స్టోర్లలో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వైబి విజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీమ్ ఫార్మాకు చెందిన తమ బ్రాండ్ ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో సుప్రీమ్ సూపర్ ఫుడ్స్‌కు చెందిన నార్మ లైఫ్, నార్మా హెల్త్ వేరియంట్లలో 50 ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామన్నారు. తాజాగా వీటిని హైదరాబాద్‌కు విస్తరించామన్నారు. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా 10వేల పైగా స్టోర్లలో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ రూ.14 కోట్ల టర్నోవర్ నమోదు చేసిందని.. తాజా విస్తరణతో వచ్చే ఏడాది రూ.100 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకుందన్నారు.