Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లకు కరోనా గుబులు పట్టుకుంది. వైరస్ భయాలకు తోడు ద్రవ్యోల్బణం మరింత పెరుగొచ్చనే అంచనాల్లో వరుసగా మూడో రోజూ సూచీల నష్టాలు చవి చూశాయి. గురువారం అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 241 పాయింట్లు కోల్పోయి 60,826కు పడిపోయింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 72 పాయింట్లు తగ్గి 18,127 వద్ద ముగిసింది. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం వైరస్ కట్టడికి పలు చర్యలకు దిగనుందనే రిపోర్టులు మదుపర్లను ఆందోళనకు గురి చేశాయి. మరోవైపు ఐరోపా, అమెరికాలో మాంద్యం భయాలకు తోడు ముడి చమురు ధరలు పెరగడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.