Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ గురుగ్రామ్: ఉబెర్ నేడు తమ ప్రచారం– ఉబెర్ కనెక్ట్‌తో ప్రేమను పంచండి (స్ర్పెడ్ వార్మ్త్ విత్ ఉబెర్ కనెక్ట్) కార్యక్రమంను ప్రారంభించింది. దీనిలో భాగంగా ఊలెన్స్(ఊలు వస్త్రాలు) మరియు ఇతర అవసరాలను ఈ శీతాకాలంలో అవసరార్ధులకు అందించాల్సిందిగా ప్రజలను ఆహ్వానిస్తుంది. ఈ దాతలకు ఉచిత పికప్స్ మరియు డ్రాప్స్‌ను ఢిల్లీ–ఎన్సీఆర్లలో డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 24 తో పాటుగా డిసెంబర్ 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అందిస్తుంది. ఈ కార్యక్రమం కోసం ఈ రైడ్ షేరింగ్ కంపెనీ అవార్డులు గెలుచుకున్న ఎన్జీఓ గూంజ్‌తో భాగస్వామ్యం చేసుకుంది.
నూతన డెలివరీ అవకాశం, కనెక్ట్ గివింగ్ ను ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా సృష్టించారు. దీనిద్వారా ప్రజలు అత్యంత కీలకమైన తోడ్పాటును ఉబెర్ యాప్ ద్వారా నిరుపేదలకు కేవలం కొన్ని బటన్స్ నొక్కడంతో అందించవచ్చు. ఊలెన్స్, బొమ్మలు, స్టేషనరీ వస్తువులను చిన్నారులకు అందించడంలో భాగంగా ఢిల్లీలోని ఎన్జీవో కార్యాలయానికి చేరవేసేందుకు ఉబెర్ కనెక్ట్ ఉచిత రైడ్స్‌ను అందించడం ద్వారా లాజిస్టిక్స్ మద్దతును ఉబెర్ అందిస్తుంది. గూంజ్ ఈ వస్తువులను తమ వింటర్ కిట్స్‌కు జోడించి , అత్యంత జాగ్రత్తగా వీటిని శీతాకాలంలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అందిస్తుంది. తాము కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కమ్యూనిటీలకు తగిన మద్దతు అందించేందుకు ఉబెర్ కట్టుబడి ఉంది. ఈ కార్యక్రమానికి సాదరంగా మద్దతు అందించాల్సిందిగా ఢిల్లీ–ఎన్సీఆర్ వాసులను కోరుతున్న ఉబెర్, యాప్‌పై కేవలం కొన్ని క్లిక్స్తో తమ మద్దతు వెల్లడించవచ్చని చెబుతుంది.
ఉబెర్ యొక్క ఈ కార్యక్రమం గురించి ఉబెర్ ఇండియా–సౌత్ ఆసియా అధ్యక్షులు ప్రబ్జీత్ సింగ్ మాట్లాడుతూ ‘‘మేము ఎక్కడైతే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామో, ఆ కమ్యూనిటీలకు తగిన మద్దతు అందించేందుకు మేమెప్పుడూ కృషి చేస్తూనే ఉంటాము. మహమ్మరి సమయంలో వ్యాక్సినేషన్ కోసం తగిన మద్దతు అందించాము. ఢిల్లీ–ఎన్సీఆర్ లో చలి చాలా తీవ్రంగా ఉంటుంది. చాలామందికి ఈ చలిగాలుల తీవ్రతతో ఇబ్బంది పడుతూ అనుభవించడమే తప్ప మరో మార్గం లేదు. ఈ కార్యక్రమం ద్వారా సహాయం చేయాలనుకునే వ్యక్తులను ప్రోత్సహించడంతో పాటుగా వారికి తగిన మద్దతు అందించాలనుకుంటున్నాము. తద్వారా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు తగిన సహాయమందించడం మరింత సులభమవుతుంది’’ అని అన్నారు
ఈ భాగస్వామ్యం గురించి గూంజ్ ఫౌండర్ డైరెక్టర్ అన్షుగుప్తా మాట్లాడుతూ ‘‘తగిన వస్త్రధారణ లేకపోతే, చలి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఎంతో కాలంగా గూంజ్ ప్రచారం చేస్తుంది. నిజానికి ఇది అతి సులభంగా పరిష్కరించే సమస్య. మన దగ్గర వాడకుండా వదిలేసిన వస్త్రాలు, ఊలెన్స్ తో ఈ సమస్యను కొంతమేర పరిష్కరించవచ్చు. ప్రతి సంవత్సరం ఈ వార్షిక ఇబ్బందులు అధిగమించేందుకు తోడ్పడటానికి మరింత మంది ప్రజలు, సంస్థలు చేతులు కలుపుతాయని ఆశిస్తున్నాము. చారిటీకి బదులుగా, గూంజ్ ఈ వస్త్రాలను తమ కమ్యూనిటీల కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజలకు గౌరవం తీసుకువచ్చేందుకు వినియోగిస్తుంది. ఆ విధంగా ఈ వస్త్రాలు వారికి వెచ్చదనం అందించడంతో పాటుగా గౌరవాన్నీ తెస్తాయి’’అని అన్నారు.
మూడు అతి సులభమైన దశలలో ఈ శీతాకాలంలో ప్రేమను పంచడానికి సహాయపడండి.
యాప్‌ను డౌన్లోడ్ చేయండి– మీ స్మార్ట్‌ఫోన్‌పై యాప్ స్టోర్ లేదా గుగూల్ ప్లే నుంచి ఉబెర్ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ ఖాతా సృష్టించడానికి దానిని తెరవండి. ఉబెర్ యాప్‌పై ప్యాకేజీ ఐకాన్ క్లిక్ చేయండి మరియు డెస్టినేషన్‌గా గూంజ్, గుర్జార్ రాజేష్ పైలెట్ మార్గ్, ఢిల్లీ సెంటర్ ను ఎంటర్ చేసి, ఉబెర్ కనెక్ట్ గివింగ్‌ను ఎంపిక చేయండి. డెలివరీ అని అభ్యర్ధించండి. ఈ రైడ్ పూర్తి ఉచితంగా మారుతుంది. 250 రూపాయల వరకూ రైడ్ ఉచితం. ఇది ఒక రైడర్‌కు ఒక ట్రిప్‌కు మాత్రమే పరిమితం. నిత్యావసర వస్తువుల డ్రాప్ లొకేషన్ సైతం గూంజ్, ఢిల్లీ ఎన్సీఆర్ ఆఫీస్ గా ఉంటుంది. వ్యక్తిగత లబ్ధిదారుల గౌరవానికి భంగం కలిగించకుండా వారిని సమున్నతంగా గౌరవించేందుకు చక్కటి స్థితిలో ఉండి, వినియోగించడానికి అనువైన వస్తువులను మాత్రమే అందించాల్సిందిగా వినియోగదారులను ఉబెర్ కోరుతుంది.