Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతీ మండల కేంద్రాన్ని చేరుకుంటాం: శ్రీరామ్ ఫైనాన్స్ సిఇఒ వెల్లడి
హైదరాబాద్ : వచ్చే రెండు, మూడేండ్లలో రుణాల జారీలో సగటున 12-15 శాతం వృద్థి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రీరామ్ ఫైనాన్స్ ఎండి, సిఇఒ వైఎస్ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం కంపెనీ జారీ చేసిన రుణాల విలువ (అసెట్ అండర్ మేనేజ్మెంట్ - ఎయుఎం) రూ.1.71 లక్షల కోట్లుగా ఉందన్నారు. 67 లక్షల మంది ఖాతాదారులు న్నారన్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన ఆ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కె శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఉమేష్ రేవన్కర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో 498 శాఖల్లో 13.5 లక్షల కస్టమర్లున్నారన్నారని చక్రవర్తి తెలిపారు. ఈ ప్రాంతాల్లో రూ.33వేల కోట్ల ఎయుఎం నమోదయ్యిందన్నారు. ఇరు రాష్ట్రాల్లోని అన్ని నియోజక వర్గాలు, మండల కేంద్రాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశ వ్యాప్తంగా ద్విచక్ర వాహన రుణ మార్కెట్లో 25 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. వాణిజ్య వాహన మార్కెట్లోనూ 20 శాతం పైగా వాటాను కలిగి ఉన్నామన్నారు. కొత్తగా సప్లయి చెయిన్, విద్యా రుణాల జారీలోకి ప్రవేశించాలని నిర్దేశించుకున్నామన్నారు.