Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
భారతదేశంలో అతిపెద్ద బంగారం ఋణ కేంద్రీకృత ఎన్బీఎఫ్సీ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్, అప్పర్ లేయర్ ఎన్బీ ఎఫ్సీగా వర్గీకరించబడినది. ఆర్బీఐ సవరించిన స్కేల్ ఆధారిత నియంత్రిత కార్యాచరణ ద్వారా మరింత సౌకర్యవంతంగా కార్యక్రమాలు చేపట్టగలమని ఆశిస్తుంది. ఇటీవలే ఆర్బీఐ విడుదల చేసిన జాబితాలో ముత్తూట్ ఫైనాన్స్‌ను అగ్రగామి 16 అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీలలో ఒకటిగా ఎన్‌బీఎఫ్‌సీల కోసం స్కేల్ ఆధారిత రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కింద ఆర్బీఐ గుర్తించింది. తద్వారా పలు ఇతర ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీలా తమ హౌదాను దీనితో మెరుగు పరుచుకున్నట్లయింది. ఈ విషయమై ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్, ఈ డిజిటలీకరణ డ్రైవ్ గురించి కె ఆర్. బిజిమోస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఓఓ, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ మాట్లాడారు.