Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈబీఆర్ అంచనా
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది 2023లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం చోటు చేసుకోనుందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) తెలిపింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న అధిక ద్రవ్యోల్బణం సంక్షోభానికి ఆజ్యం పోస్తుందని పేర్కొంది. మరోవైపు ద్రవ్యోల్బణ కట్టడికి వరుసగా పెంచుతున్న వడ్డీ రేట్లు రుణాలను మరింత భారం చేస్తున్నాయని తెలిపింది. దీంతో అనేక దేశాల వృద్ధి మందగిస్తుందని విశ్లేషించింది. 2022లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్లు చేరినప్పటికీ.. ధరల కట్టడి కోసం చేపడుతున్న చర్యలు వృద్థికి విఘాతంలా మారాయని తెలిపింది. 2023లోనూ రేట్ల పెంపు కొనసాగుతుందని అంచనా వేసింది. ఇది వచ్చే కొన్నేండ్ల పాటు వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపించనుందని తెలిపింది.