Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఒన్-స్టాప్ షాప్ అనుకూలత మరియు కంటెంట్ డిస్కవరీని సరళం చేసే దిశలో టాటా ప్లే బింగే నేడు గ్లోబల్ కంటెంట్ ప్లాట్ఫారం లయన్స్‌గేట్ ప్లేతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. లయన్స్‌గేట్ ప్లే స్ట్రీమింగ్‌లో విస్తృత డిజిటల్ ప్రీమియర్లు, కుతూహలకారి మరియు సమకాలీన కంటెంట్‌ను అన్ని భాషలు మరియు జానర్లలో, బిలియన్-డాలర్ ఫ్రాంఛాయిసీ చలన చిత్రాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు మరియు ప్రీమియం ఒరిజినల్స్‌ను భారతదేశంలోని ప్రేక్షకుల కోసమే ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకు వస్తోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అందరికీ ప్రీమియం ఓటీటీ యాప్‌ల నుంచి కంటెంట్‌ను ఆస్వాదించేందుకు అవకాశాన్ని అందించే టాటా ప్లే బింగే విస్తృత శ్రేణిలో చలన చిత్రాలు, టీవీ షోలు, వెబ్ ఒరిజినల్స్, మరియు లైవ్ స్పోర్ట్స్‌ను 14+స్ట్రీమింగ్ యాప్‌ల నుంచి అందిస్తుండగా, ఇది ఒకే యూజర్ ఇంటర్ఫేస్లో అందుబాటులో ఉంచుతూ మరియు పర్సనలైజ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ సరికొత్త చేరికతో టాటా ప్లే బింగే ప్రేక్షకులకు లయన్స్‌గేట్ ప్లేకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన మరియు విస్తృతమైన కంటెంట్ లైబ్రరీకి అందుబాటు ఇస్తుండగా, అందులో ఇండియన్ ఒరిజినల్స్‌తో పాటు ప్రపంచంలోని ప్రజాదరణ పొందిన సినిమాలు మరియు షోలైన జాన్ విక్-చాప్టర్ 3 ప్యారాబెల్లుం, ఏంజెల్ హ్యాజ్ ఫాలెన్, గ్యాస్లిట్, ఫీల్స్ లైక్ హోమ్, నైవ్స్ ఔట్, టోకియో వైస్, జంగిల్ క్రై, పికప్స్ అండ్ హుకప్స్ తదితరాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఆయా ప్రాంతాలకు చెందిన అపరిమిత గంటల మనోరంజన టాటా ప్లే బింగే మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉండగా, పెద్ద స్క్రీన్కు కనెక్టెడ్ పరికరాలు, టాటా ప్లే బింగే+ ఆండ్రాయిడ్ సెట్ టాప్ బాక్స్ మరియు అమెజాన్‌కు టాటా ప్లే ఎడిషన్ ఫైర్ టీవీ స్టిక్ మరియు www.TataplayBinge.comలలో అందుబాటులో ఉంది. వీక్షకులు ఇప్పుడు లయన్స్‌గేట్ ప్లే మరియు ఇతర 18 యాప్‌లను నెలకు రూ.299/- ప్యాకేజ్ ధరలో పొందవచ్చు. లయన్స్‌గేట్ చేరిక గురించి టాటా ప్లే చీఫ్ కమర్షియల్ అండ్ కంటెంట్ ఆఫీసర్ పల్లవి పురి మాట్లాడుతూ, ‘‘ప్రతి కొత్త చేరిక టాటా ప్లే బింగేను ఎక్కువ డైనమిక్ చేస్తుంది మరియు ఓటీటీ కంటెంట్ వినియోగదారుల పరిగణన లోపల చేరిక చేస్తుంది. లయన్స్‌గేట్ ప్లే ద్వారా వినియోగదారులకు ముఖ్యంగా హాలీవుడ్‌లోని విస్తృత శ్రేణి ప్రీమియం మరియు ఉన్నత నాణ్యత కంటెంట్ లభించేలా చేస్తుంది. ఒకే చోట ఏకీకృతంగా ఉండే అనుకూలత మరియు కే బిల్ మాత్రమే కాకుండా ఓటీటీ మనోరంజన టాటా ప్లే బింగేలో ఒకే క్లిక్‌లో లభిస్తుంది.
లయన్స్‌గేట్ ప్లే ఇవీపీ అమిత్ ధనుకా మాట్లాడుతూ, ‘‘మేము లయన్స్ గేట్ ప్లేలో టాటా ప్లే బింగేతో భాగసామ్యానికి సంతోషిస్తున్నాము. భారతదేశంలో ఓటీటీ వలయం వృద్ధి చెందుతోంది మరియు మేము దాని భవిష్యత్తుపై నమ్మకాన్ని ఉంచాము- ఇది అత్యంత అస్తవ్యస్థమైన వ్యాపారంలో సులభంగా అందుబాటు మరియు కంటెంట్ ఆవిష్కారానికి మద్దతు ఇస్తుంది. దీనితో అన్ని బ్రాండ్లకూ విస్తృత శ్రేణిలో వినియోగదారులను చేరేందుకు సాధ్యపడుతుంది. ఈ భాగస్వామ్యంతో మేము అందుబాటు ధరలలో ప్రీమియం కంటెంట్‌ను ఉన్నతీకరించిన వీక్షణ అనుభవాన్ని అందిస్తున్నామని’’ వివరించారు. లయన్స్ ప్లే ప్రస్తుతం 14+ అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ ప్లాట్‌ఫారాలైన డిస్నీ+హాట్‌స్టార్, జీ5, మ్యాక్స్ ప్లేయర్, సోనీ లివ్, వూట్ సెలెక్ట్, హోయ్‌చోయ్, ప్లానెట్ మరాఠి, నమ్మఫ్లిక్స్, చౌపాల్, సన్ నెక్ట్స్, హంగామా ప్లే, ఎరోస్ నౌ, శిమారోమీ, వూట్కిడ్స్, క్యూరియాసిటీ స్ట్రీమ్, ఎపిక్ ఆన్ మరియు డాక్యుబే శ్రేణిలో చేరింది. ఈ అన్ని ప్లాట్‌ఫారాల కంటెంట్ టాటా ప్లే బింగేలో వీక్షకులకు ఒకే సబ్‌స్ర్కిప్షన్ మరియు ఒకే యూజర్ ఇంటర్ఫేజ్ ద్వారా లభిస్తుంది. ఉచిత గేమింగ్ కూడా టాటా ప్లే బింగేలో మరొక పాయింట్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్‌గా లభిస్తుంది. టాటా ప్లే డిటిహెచ్ చందాదారులకు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంటుంది.