Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ లానెక్సెస్ శీతోష్ణస్థితి మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో సాధించిన విజయాలకు మరోసారి గుర్తింపు పొందింది. ప్రఖ్యాత క్లైమేట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్ అయిన సీడీపీ తాజా మదింపు లో, గ్రూప్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 283 కంపెనీలలో ఒకటిగా క్లైమేట్ 'ఎ` జాబితాలోకి చేరింది. సీడీపీ స్కోర్ చేసిన దాదాపు 15,000 కంపెనీలలో టాప్ 2 శాతంలో లానెక్సెస్ ఉంది. "ఎ" రేటింగ్ అనేది శీతోష్ణస్థితి రక్షణ కార్యకలాపాలపై ప్రత్యేకంగా పారదర్శకంగా, స మగ్రంగా నివేదించే, సంబంధిత ప్రాజెక్ట్ లను అమలు చేసే కంపెనీలకు ఇవ్వబడు తుంది. లానెక్సెస్ ఈ సంవత్సరం ఆరవసారి ఎ జాబితాలో ఉంది. 2012 నుండి ఈ గ్రూప్ సీడీపీ కి శీతోష్ణస్థితి రక్షణ-సంబంధిత డేటాను వెల్లడిస్తోంది. "కస్టమర్లు, మదుపరులు, కంపెనీ కార్యకలాపాలతో ప్రమేయం ఉన్న అనేకమంది లానెక్సెస్ కార్యకలాపాల సుస్థిరత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఇది శీతోష్ణ స్థితి రక్షణ ఎజెండాలో అగ్రస్థానంలో ఉంది. మరోసారి సీడీపీ A లిస్ట్ లో ఉండటం అ నేది మేం ఈ రంగంలో చాలా కృషి చేస్తున్నామని, ఇప్పటికే చాలా సాధించామని తెలియచేస్తుంది" అని లానెక్సెస్ ఏజీ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యుడు హుబెర్ట్ ఫింక్ అన్నారు.