Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ షావోమి కొత్తగా రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దీంతో జియో వినియోగదారులకు 'ట్రూ 5జి' అనుభవాన్ని అందిస్తోన్నట్లు పేర్కొంది. షావోమి, రెడ్ మి స్మార్ట్ఫోన్ వినియోగదారులు అంతరాయం లేని ట్రూ 5జి కనెక్టివిటీని యాక్సెస్ చేసుకోవడానికి, అధిక రిజల్యూషన్ వీడియో కాల్స్ ఆస్వాదించడానికి, వారి పరికరాలలో తక్కువ-లేటెన్సీ గేమింగ్ ఆడటానికి ఈ అనుబంధం వీలు కల్పిస్తుందని పేర్కొంది. తమ సంస్థకు చెందిన పలు 5జి స్మార్ట్ ఫోన్లను రిలయన్స్ జియో ట్రూ 5జీ నెట్వర్క్తో పరీక్షించారని తెలిపింది.