Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వీడియోకాన్‌కు రుణాల జారీలో క్విడ్‌ప్రోకోకు పాల్పడిన ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందా కొచ్చర్, అమె భర్త దీపక్ కొచ్చర్లకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో సిబిఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ అత్యవసర విచారణ జరపాలని వారు దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఐసిఐసిఐ బ్యాంకు మాజీ ఎండి, సిఇఒ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 23న కొచ్చర్ దంపతులను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రత్యేక కోర్టు మూడు రోజుల పాటు రిమాండ్ విధించింది. అదనపు గడువు కోరుతూ సిబిఐ అప్పీల్ చేసింది. దీంతో కొచ్చర్ దంపతులకు 28 వరకు రిమాండ్ పొడిగించింది. బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్దంగా వీడియోకాన్ కంపెనీకి రూ.3,200 కోట్లకుపైగా కొచ్చర్ రుణాలు ఇచ్చారు.