Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : క్యాబ్ అగ్రిగేటర్ వేదికలు ఓలా, ఉబెర్ సంస్థల్లో పని పద్దతులు చాలా అథమ స్థాయిలో ఉన్నాయని ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ 2022 ఓ రిపోర్టులో తెలిపింది. భారత్‌లోని ఆన్‌లైన సేవల సంస్థల్లోని పని కేంద్రాలపై ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి ఈ రిపోర్టును తయారు చేసినట్లు తెలిపింది. ఈ రిపోర్టు ప్రకారం.. అమెజాన్ ఫ్లెక్స్, డూంజో, ఓలా, ఫార్మ్ఈజీ, ఉబెర్ సంస్థలు 10 పాయింట్లకు గాను జీరో స్కోర్‌ను పొందాయి. అర్బన్ కంపెనీ అత్యధికంగా 10 పాయింట్లకు ఏడు పాయింట్లతో మెరుగైన స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో మెరుగైన పని ప్రదేశాలుగా ఉన్నాయి.