Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్:
తమ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ పాలీను యాక్ససబిలిటీ విభాగంలో అత్యుత్తమ ఆవిష్కరణగా టైమ్ గుర్తించినట్లు థింకర్‌బెల్ బృందం వెల్లడించింది. థింకర్ బెల్ యొక్క పేటెంటెడ్ ఉత్పత్తి అన్నీ కి యుఎస్ వేరియంట్ పాలీ. ప్రపంచంలో మొట్టమొదటి, రిమోట్ ఆధారిత, స్వీయ అభ్యాస బ్రెయిలీ అక్ష్యరాస్యత ఉపకరణం అన్నీ. దీనిని అమెరికన్ ప్రింటింగ్ హౌస్ ఫర్ ద బ్లైండ్ (ఏపీహెచ్) భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. అన్నీ, పాలీ రెండూ కూడా వై–ఫై ఆధారిత ఉపకరణాలు. ఇవి వినియోగదారులకు వారి అభ్యాసం మెరుగుపరుచుకునేందుకు సహాయపడటంతో పాటుగా బ్రెయిలీ నేపథ్యాలను పునరుద్ఘాటిస్తూనే, కాంట్రాక్ట్‌డ్, అన్కాంట్రాక్ట్డ్ బ్రెయిలీని సైతం జోడిస్తుంది.
‘‘మా మొట్టమొదటి అన్నీ స్మార్ట్ క్లాస్‌ను రాంచీలో 2018లో ప్రారంభించాము. నేడు, మాకు భారతదేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలలో 50 అన్నీ స్మార్ట్ క్లాస్ సెంటర్లు ఉన్నాయి. అన్నీ ఇప్పుడు భారతదేశంలో 8 భాషలలో లభ్యమవుతుంది’’ అని దిలీప్ రమేష్, కో–ఫౌండర్, సీటీఓ– థింకర్ బెల్ ల్యాబ్స్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అన్నీని డిజిటల్ ఇండియా వీక్ 2022 వద్ద ప్రశంసించారు. తన ప్రసంగంలో సైతం ఆయన అన్నీని ప్రస్తావించారు. థంకర్ బెల్ ల్యాబ్స్‌కు ఇటీవలనే ఎంఐటీ సాల్వ్ నుంచి పలు ప్రశంసలు లభించడంతో పాటుగా నేషనల్ స్టార్టప్ అవార్డు, షార్క్ ట్యాంక్ ఇండియా వంటి అవార్డులు లభించాయి. సమ్మిళిత విద్య భవిష్యత్‌ను ఇది నిర్మించనుంది. ‘‘విజయవంతమైన భాగస్వామ్యాలకు అత్యుత్తమ ఉదాహరణ పాలీ. గణనీయమైన ప్రభావాన్ని ఇది చూపుతుంది. భారతదేశంలో మా ప్రయాణం ప్రారంభించాము. మా లక్ష్యం పంచుకోవడంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా మా ఆవిష్కరణలను పంచుకునే సంస్థలతో భాగస్వామ్యం చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని సంస్కృతి దావ్లీ, కో–ఫౌండర్ మరియు సీఈఓ –థింకర్ బెల్ ల్యాబ్స్ అన్నారు.
పాలీ థాంప్సన్ స్మారకంగా పాలీ పేరు పెట్టారు. హెలెన్ కెల్లర్ సహచరునిగా, ఇంటర్‌ప్రిటర్‌గా 46 సంవత్సరాలు ఆయన గడిపారు. పాలీని ప్రస్తుతం క్షేత్ర స్ధాయిలో పరిశోధిస్తున్నారు. 2023లో అధికారికంగా విడుదల చేయనున్నారు. భారతీయ స్టార్టప్‌కు ఇది ఓ ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలువడంతో పాటుగా యుఎస్ఏలో విప్లవాత్మక ఆవిష్కరణగా నిలుస్తుంది. పాలీ ఆవిష్కరణతో, అంతర్జాతీయంగా 100% బ్రెయిలీ అక్ష్యరాసత్యను చేరుకోవాలనే లక్ష్యం చేరుకోవడానికి మరో అడుగు మందుకేశారు. భారతీయ స్టార్టప్ థింకర్ బెల్ ల్యాబ్స్. అంతర్జాతీయంగా దృష్టిలోపంతో బాధపడుతున్న వ్యక్తులకు విద్యనందించడంలో విప్లవాత్మక మార్పులను సంస్థ తీసుకువచ్చింది. మేము మా పేటెంటెడ్ సాంకేతితను అన్నీ గా సృష్టించాము. ఇది ప్రపంచంలో అత్యంత సమగ్రమైన బ్రెయిలీ లిటరసీ డివైజ్‌గా నిలిచింది.