Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూవర్స్.కమ్ సిఇఒ వెల్లడి
హైదరాబాద్ : వచ్చే నాలుగేళ్లలో రూ.2వేల కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మూవర్స్.కమ్ వ్యవస్థాపకులు, సిఇఒ విద్యాధర్ గారపాటి అన్నారు. రీలొకెటెడ్ (పునరావాస) పోర్టల్ మూవర్స్.కమ్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థ హైదరాబాద్‌లో 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంది. ఈ సందర్బంగా విద్యాధర్ మాట్లాడుతూ.. మూవర్స్.కమ్ లీడ్ అగ్రిగేటర్ నుంచి రీలొకేషన్ మేనేజ్మెంట్ కంపెనీగా మారడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నా మన్నారు. గత రెండు దశాబ్దాల్లో 35 లక్షల మంది వినియోగదారులకు సేవలందించామన్నారు. అపార్ట్మెంట్లోని ఒక గదిలో ప్రారంభమై తమ సంస్థ ఇప్పుడు 75 సిబ్బంది గల కంపెనీగా ఎదిగిందన్నారు. ఏడాదికి రూ.165 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేస్తుందన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు తన కార్యకలాపాలను విస్తరించాలని కూడా యోచిస్తోందన్నారు. వద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. అదే విధంగా బీమా, గహ మెరుగుదల, గృహ భద్రత మొదలైన క్రాస్ సెల్లింగ్ సేవలలోకి ప్రవేశించడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు.