Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 వాహనాలను అందించనున్న కంపెనీ
హైదరాబాద్ : దక్షిణాదిలోనే తొలి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు శనివారం బెంగళూరులో ప్రారంభమైంది. 12 మీటర్ల ఓలెక్ట్రా ప్రీమియం లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును కర్ణాటక రవాణా శాఖ మంత్రి బి శ్రీరాములు లాంచనంగా ప్రారంభించారు. ఎయిర్ కండిషన్డ్, ఒలెక్ట్రా ఇ-బస్ ప్రీమియం లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు ఆవిష్కరణ కార్యక్రమంలో కెఎస్ఆర్టిసి చైర్మన్ ఎం చంద్రప్ప, ఎండి వి అన్బు కుమార్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓలెక్ట్రా సిఎండి కెవి ప్రదీప్ మాట్లాడుతూ.. ''దేశంలో 2021లో ఇంటర్సిటీ ఎలక్ట్రిక్ లగ్జరీ కోచ్ బస్సులను ప్రవేశపెట్టిన మొదటి కంపెనీ తమదేనని అన్నారు. ''మేక్ ఇన్ ఇండియా'' ద్వారా, ఓలెక్ట్రా ఫేమ్ 2 పథకం కింద 50 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తుందని అన్నారు. ఈ ఇ-బస్సులు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 7 డిపోల నుండి బయలుదేరుతాయి. ఇది ప్రజా రవాణాలో ఒలెక్ట్రా ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ట్రాఫిక్, ప్రయాణీకుల సంఖ్యా ఆధారంగా ఇ-బస్సులు ఒకే ఛార్జ్‌పై 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయన్నారు.