Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విస్తరణ ప్రణాళికలు రద్దు
న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్ల భయాలు విమానయాన రంగ కంపెనీలను బెంబేతెత్తిస్తు న్నాయి. కొత్త ఏడాది ఎలా ఉంటుందోననే ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో ఆ రంగంలోని కంపెనీలు కొత్త పెట్టుబడులు, విస్తరణపై ఆచీతూచి వ్యవహారిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు మొదలవుతున్న నేపథ్యంలో ఆయా కంపెనీలు వ్యయాలపై ఆలోచనలో పడ్డాయని విమానయాన రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా కాలంలో భారీ నష్టాలను ఎదుర్కొన్న కంపెనీలు గత ఎడెనిమిది నెలల నుంచి రాణిస్తున్నాయి. కాగా.. 2023 ఈ కంపెనీలాకు లాభదాయకంగా ఉండొచ్చనే విశ్వాసం ఉన్నప్పటికీ.. మరోవైపు భయాలు నెలకొన్నాయని ఏవియేషన్ నిపుణులు అమెయా జోషి పేర్కొన్నారు. 2021 చివరి మాసంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను కూడా డిజిసిఎ అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.