Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోని అధిక ధరలు ద్విచక్ర వాహన మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. 2022 డిసెంబర్లో ద్విచక్ర వాహన అమ్మకాలు స్తబ్దుగా నమోదయ్యాయి. ఈ రంగంలోని హీరో మోటో కార్ప్, టివిఎస్ మోటర్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్, సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ ల అమ్మకాలు 7,68,985 యూనిట్లుగా నమోదయ్యాయి. 2021 డిసెంబర్ మాసం అమ్మకాలతో పోల్చితే కేవలం మూడు శాతం మాత్రమే పెరిగాయి. అధిక ధరలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థిక సవాళ్లు అమ్మకాల ను దెబ్బతీశాయని ఆ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గడిచిన నెలలో హీరో మోటో అమ్మకాల్లో 1.84 శాతం, టివిఎస్ మోటార్ 9.95 శాతం, సుజుకి మోటార్ సైకిల్ అమ్మకాలు 25.67 చొప్పున పెరిగాయి. మరోవైపు బజాజ్ ఆటో విక్రయాలు 1.62 శాతం, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 8.25 శాతం చొప్పున తగ్గాయి.