Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాంద్యంలోకి మూడోవంతు దేశాలు
- సంక్షోభం అంచున అమెరికా : ఐఎంఎఫ్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో ప్రపంచంలోని మూడో వంతు దేశాలు ఆర్థిక మాద్యంలో చిక్కుకోనున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. 2023లో మాంద్యం సంభవించనుందని విశ్లేషించారు. సిబిఎస్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్యూలో జార్జివా మాట్లాడుతూ.. ''గత ఏడాదితో పోలిస్తే.. 2023లో మరింత గడ్డు పరిస్థితులు చోటు చేసుకోనున్నాయి. అమెరికా, యురోపియన్ దేశాలతో పాటు చైనా తదితర ఆర్ధిక వ్యవస్థలు మందగిసు ్తన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం, అధిక ధరలు, వడ్డీ రేట్లు, చైనాలో మళ్లీ కరోనా లాంటి పరిస్థితులు అనేక దేశాల్ని ఇబ్బందిపెడుతున్నాయి. ఆర్థిక మాంద్యం లేని దేశాల్లో కూడా ఈ ఏడాది లక్షలాది మంది ఆ ప్రభావానికి గురైయ్యే అవకాశాలు ఉన్నాయి.'' అని పేర్కొన్నారు. 10 నెలలు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుండడం, ద్రవ్యోల్బణం అధిక వడ్డీ రేట్లు, చైనాలో కరోనా కేసుల పెరుగుదల వంటి పరిస్థితుల నేపథ్యంలో జార్జివా ఈ వ్యాఖ్యలు చేశారు.''అమెరికా ఆర్ధిక మాంద్యం అంచుల్లో ఉంది. ఇక యూరోప్ దేశాలు కూడా ఆ ప్రమాదం నుంచి గట్టెక్కడం అసాధ్యమే. మరికొన్ని నెలల పాటు చైనాలోనూ కఠిన పరిస్థితులు ఉండొచ్చు. అది చైనా వృద్థి పైనా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైనా ప్రతికూల ప్రభాన్ని చూపించనుంది.'' అని జార్జియా పేర్కొన్నారు. ఇటీవల అక్టోబర్లో ప్రపంచ వృద్థి రేటు అంచనాలకు ఐఎంఎఫ్ కోత పెట్టింది. 2021లో 6 శాతంగా ఉన్న ప్రపంచ వృద్థి రేటు 2022లో 3.2 శాతానికి పడిపోనుందని అంచనా వేసింది. 2023లో ఏకంగా 2.7 శాతానికి క్షీణించొచ్చని ఐఎంఎఫ్ విశ్లేషించింది. 2008 ఆర్థిక మాంద్యం, కరోనా పరిస్థితులను మినహాయిస్తే 2001 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయిలో వద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి కానుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఇప్పటికే అనేక ఆర్థిక వ్యవస్థలు హెచ్చు ద్రవ్యోల్బణంతో ఆర్థిక సంక్షోభ అంచుల్లో ఉన్నాయని అంతర్జతీయ ఎజెన్సీలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.