Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇప్పుడు, 21వ శతాబ్దంలో ఆధిపత్యాన్ని సాధించేందుకు భారతదేశానికి ఇది చక్కని అవకాశం. తన ఆశయాలు, ప్రణాళికలతో పాటు ఇటువంటి అవకాశం ద్వారా ఓలా ప్రేరణ పొంది, భారతదేశాన్ని ఈవీలకు గ్లోబల్ హబ్‌గా మార్చుతోంది. ఓలా తన మొదటి స్కూటర్ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద 2 వీలర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రకటనతో 15 ఆగస్టు 2021న తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రకటన విడుదలైన కేవలం 15 నెలలలోనే ఓలా ఇప్పటికే ఆదాయం మరియు పరిమాణం రెండింటిలోనూ భారతదేశంలో అతిపెద్ద ఈవీ కంపెనీగా, అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా మారింది. కంపెనీ 2022లో దాదాపు 1,50,000 ఈవీలను విక్రయించింది. భారతదేశంలో 2030 నాటికి విక్రయించే అన్ని 2వీలర్లు మరియు కార్లు ఎలక్ట్రిక్‌గా ఉండే మిషన్ ఎలక్ట్రిక్ కోసం కృషి చేస్తోంది.
ఈ భవిష్యత్తును నిర్మించేందుకు ఓలా 3 దశల వ్యూహాన్ని కలిగి ఉంది:
ఉత్పత్తి వైవిధ్యం మరియు ప్రపంచ స్థాయిలో తయారీ: విద్యుత్తుతో నడిచే 2వీలర్లతో కోర్ టెక్నాలజీలు, సప్లయ్ చెయిన్ మరియు ఛార్జింగ్ ఇన్ఫ్రా వంటి మౌలిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి మరియు పోటీ సామర్థ్యాలను నిర్మించడానికి కంపెనీని అనుమతిస్తుంది. భారతదేశంలో 20 మిలియన్ ఎలక్ట్రిక్ 2వీలర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో అత్యధికంగా వీటిని వినియోగిస్తున్న మూడవ దేశంగా నిలిచింది. ప్రపంచంలోనే ఈవీల కోసం అతిపెద్ద మార్కెట్లలో (GWh వినియోగించినది - 100GWh), యుఎస్ మరియు చైనా తర్వాత భారత్ నిలిచింది. 2వీలర్లకు ఈ పునాది ఓలా ఈవీ 4వీలర్లను తయారు చేసేందుకు స్ఫూర్తిని కలిగించిం. భారతదేశంలో 2022లో ఓలా తన ప్రీమియం స్కూటర్ ఓలా ఎస్1ను విడుదల చేసింది. కంపెనీ కేవలం 1 ఏడాదిలోనే ప్రీమియం స్కూటర్ మార్కెట్ (ధర ₹1,00,000 కన్నా ఎక్కువ ఎక్కువ) పూర్తి విద్యుదీకరణను సాధించింది. కాగా, 2023 మరియు 2024లో, కంపెనీ మరిన్ని 2వీలర్ ఈవీ ఉత్పత్తులను విడుదల చేస్తుంది - మాస్ మార్కెట్ స్కూటర్, మాస్ మార్కెట్ మోటార్‌సైకిల్ మరియు బహుళ ప్రీమియం మోటార్‌సైకిళ్లు (స్పోర్ట్స్, క్రూయిజర్లు, అడ్వెంచర్ మరియు రోడ్ బైక్‌లు). 2వీలర్ తయారీ ఈ బలమైన స్కేల్ ఓలాకు కోర్ ఈవీ సాంకేతికతలు మరియు సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు మరియు పవర్ ట్రైన్లలో సప్లయ్ చెయిన్‌లో చాలా బలమైన పోటీ ప్రయోజనాన్ని అందిస్తుంది మరియు కంపెనీ ప్రపంచ స్థాయి 4వీలర్ ఉత్పత్తులను చాలా పోటీ ధరలలో తయారు చేయగలదన్న విశ్వాసాన్ని దక్కించుకుంది. ఓలా తన మొదటి కారును 2024లో విడుదల చేసి, 2027 నాటికి, కంపెనీ మార్కెట్లో 6 విభిన్న ఉత్పత్తులను కలిగి ఉండనుంది.
సెల్ టెక్నాలజీలలో వర్టికల్ ఇంటిగ్రేషన్ మరియు సంబంధిత సప్లయ్ చెయిన్‌ను లోకలైజ్ చేయడం: కోర్ సెల్ టెక్నాలజీపై ఓలా తన 2 ఏళ్ల క్రితం తన దృష్టిని కేంద్రీకరించింది మరియు 2022లో కంపెనీ ఓలా బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్లో కార్యకలాపాలను ప్రారంభించింది – ఇక్కడ 1,000 కన్నా ఎక్కువ మంది పరిశోధకులు సెల్ టెక్ భవిష్యత్తుపై మరియు తమ సొంత ఐపీని రూపొందించేలా పని చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఓలా 2023 చివరి నాటికి, ఈ దశాబ్ద కాలంలో 100GWhని ఇన్స్టాల్ చేయాలనే ఆశయంతో 5GWh సామర్థ్యంతో తమ బ్యాటరీ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించనుంది. ఓలా సొంత సాంకేతికత మరియు లోకలైజ్ చేసిన సప్లయ్ చెయిన్ ఇతర ప్రపంచ మరియు భారతీయ కంపెనీల కన్నా కంపెనీకి బలమైన పోటీ ప్రయోజనాన్ని అందిస్తోంది. సంబంధిత మార్కెట్లలో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ 1 & 2 పరపతి: ఓలా ప్రపంచ స్థాయి ఉత్పత్తులు ₹1,00,000 – ₹50,00,000 ధర పాయింట్లో, బలమైన ప్రధాన సాంకేతికత మరియు లోకలైజ్ చేసిన తక్కువ-ధర సప్లయ్ చెయిన్ కంపెనీకి ఎగుమతి చేయడానికి చాలా ముఖ్యమైన ప్రపంచ ప్రయోజనాన్ని అందిస్తుంది. భారతదేశం నుంచి మరియు ఆగ్నేయ ఆసియా, లాటిన్ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా మొదలైన అన్ని సంబంధిత మార్కెట్లలో ఈవీ మొబిలిటీలో అగ్రగామిగా నిలిచింది. ఓలా ఈ మిషన్‌కు మార్గదర్శకత్వం చూపేందుకు కట్టుబడి ఉంది.
భారతదేశంలో ఈవీ విప్లవం వాస్తవంగా ప్రారంభమైన ఏడాదిగా 2022 నిలిచిపోతుంది. జూన్ 2021లో నెలకు కేవలం 4000 యూనిట్ల నుంచి 2022 చివరికి నెలవారీ సగటు 80,000 యూనిట్లకు చేరుకుంది. ఇది 20x వృద్ధి. అలాగే 2021లో 1% కన్నా తక్కువ పెనిట్రేషన్ నుంచి కేవలం ఒక ఏడాదిలో దాదాపు 6% వరకు వృద్ధి చెందింది. భారతదేశంలో ఈవీ విప్లవం పట్టణ కేంద్రాలకు మాత్రమే కాకుండా, ఇది దేశ వ్యాప్తంగా విస్తరించింది. వాస్తవానికి, బెంగళూరు, పుణె, సూరత్ వంటి అనేక నగరాల్లో ఇప్పటికే దాదాపు 20% ఈవీలను వినియోగిస్తున్నారు. అలాగే 1, 2, 3 స్థాయి నగరాలు మరియు గ్రామీణ కేంద్రాలలో ఈవీల కోసం వినయోగదారుల ప్రాధాన్యతతో భారతదేశంలో మార్కెట్ ఎల్లప్పుడూ ఉనికిలో ఉందని, కొత్త, ఉన్నతమైన సాంకేతికత కలిగిన-ఈవీలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.