Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బంగారం ధర ఎగిసిపడుతోంది. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారంపై రూ.378 పెరిగి రూ.56,130కి చేరిందని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ తెలిపింది. ఇంతక్రితం సెషన్లో రూ.55,752 వద్ద నమోదయ్యింది. కిలో వెండి ధర రూ.147 తగ్గి రూ.70,675గా పలికింది. డాలర్ విలువ తగ్గడంతో వరుసగా ఆరో వారాల గరిష్టానికి బంగారం ధరలు ఎగబాకాయని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవ్నీత్ దమానీ పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లో ఒక్క ఔన్స్ పసిడి ధర 1,859 డాలర్లుగా, వెండి ధర 24.24 డాలర్లుగా నమోదయ్యింది.