Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: అర్బన్ కంపెనీ, పొంగల్ మకర సంక్రాంతి వంటి పండుగల సందర్భంగా తల్లీ కూతుళ్ళ మధ్య గల అందమైన బంధం యొక్క సంబరాలు జరుపుకునే ఒక చిత్రం ద్వారా చెన్నై, హైదరాబాద్, మరియు బెంగళూరు వంటి నగరాలపై దృష్టి సారిస్తూ ఒక పరివర్తన యాడ్ క్యాంపెయిన్ ప్రారంభించింది.
ఈ క్యాంపెయిన్, 'నిజమైన ఐశ్వర్యము' మనకు ప్రియమైన వారి, ప్రత్యేకించి మన పిల్లల సంతోషంలో ఉంటుందనే విషయాన్ని ఎత్తి చూపుతూ, ఐశ్వర్యాన్ని ఆహ్వానించడానికై మన ఇళ్ళను శుభ్రం చేసుకునే పండుగ సాంప్రదాయాన్ని ప్రదర్శించి చూపుతూ భావోద్వేగంగా హత్తుకుపోయే చిత్రాన్ని కలిగి ఉంటుంది.
QED కమ్యూనికేషన్స్ వారిచే రచించబడిన ఈ చిత్రం, తల్లిదండ్రులు తమ పిల్లలకు సాంప్రదాయాలను నేర్పిస్తూ పండుగలను జరుపుకోవాలనే మక్కువ యొక్క గ్రాహ్యత నుండి మొగ్గ తొడుగుతుంది, తమ ఇంటిని శుభ్రం చేసుకోవాలనే ఒత్తిడి తరచుగా వారి సమయాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. వ్యక్తి సౌకర్యం మేరకు పూర్తిగా ఇంటిని శుభ్రపరచుకునే సేవలను అందించాలనే తన ప్రతిపాదన ద్వారా అర్బన్ కంపెనీ సులభంగా ఆ సమస్యను పరిష్కరించగలుగుతుంది.
ఈ వినూత్నమైన సేవ ద్వారా అర్బన్ కంపెనీ, దయాపూర్వక మరియు సహానుభూతి ప్రదర్శించే భాగస్వాములు మరియు వినియోగదారు-కేంద్రిత విధానం యొక్క వెన్నుదన్నుతో తన కస్టమర్లకు ఒత్తిడి-లేని అనుభవాన్ని అందజేయడం ద్వారా సాటిలేని సౌకర్యమును అందించాలనే తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుంది.
ఈ క్యాంపెయిన్ గురించి మాట్లాడుతూ, QED కమ్యూనికేషన్స్ క్రియేటివ్ డైరెక్టర్ శ్రీ హరిహర్ గోస్వామి గారు, ఇలా అన్నారు, “తమ పిల్లలకు సాంప్రదాయాలను నేర్పించాలనేది ప్రతి తల్లి, తండ్రి యొక్క ఆకాంక్షగా ఉంటుంది. అర్బన్ కంపెనీ, పండుగపూట శుభ్రం చేసుకునే పనిని ఒత్తిడి లేని అనుభవంగా ఎలా నెలకొల్పుతుందో చూపిస్తూ ఈ క్యాంపెయిన్ ప్రత్యక్షంగా ఈ భావోద్వేగ గ్రాహ్యతతో మొదలవుతుంది, తద్వారా వ్యక్తులు తమకు ప్రియమైన వారితో ఎక్కువ పండుగ సమయాన్ని గడుపుతూ తమకు నచ్చిన నిజమైన స్ఫూర్తితో సాంప్రదాయ వేడుకలను జరుపుకోగలుగుతారు. అక్కడనే నిజమైన శ్రేయస్సు ఉంటుంది.’
ఈ క్యాంపెయిన్ గురించి వ్యాఖ్యానిస్తూ, అర్బన్ కంపెనీ మార్కెటింగ్ విభాగం వైస్ - ప్రెసిడెంట్ స్మిత్ శుక్లా గారు ఇలా అన్నారు, “ఒక సంస్థగా మేము మా వినియోగదారులు మరియు భాగస్వాముల జీవితాల్ని మెరుగు చేసి మరియు వారితో లోతైన స్థాయిలో అనుసంధానం ఏర్పరచుకోవడంపై నమ్మకం ఉంచుతాము. మా వినియోగదారులతో భావోద్వేగమైన మరియు పనితీరుకు సంబంధించిన అనుసంధానతను తట్టి లేపడానికి మరియు మా నైపుణ్యమైన శుభ్రతా సేవల ద్వారా పొంగల్ మరియు మకర సంక్రాంతి యొక్క అంతర్భాగంగా ఉండడానికి ఈ క్యాంపెయిన్ ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఈ క్యాంపెయిన్, ప్రత్యేక సందర్భాలు, వేడుకలలో లోతుగా వేళ్ళూనుకుపోయిన మన ఇళ్ళ యొక్క శుభ్రతా క్రతువును మరియు మా వినియోగదారులు ఒక కుటుంబముగా ఎలా కలిసిమెలసి అందుకోసం తయారు అవుతారో గుర్తు చేస్తుంది. మా వినియోగదారులకు వారి ఇంటిని పండుగ కోసం సిద్ధం చేయడానికి సంబంధించి సౌకర్యతను ఇవ్వడం, ఈ విషయంలో, మా నైపుణ్యమైన శుభ్రతా సేవల ద్వారా “పొంగల్/మకర సంక్రాంతికి సిద్ధం చేయడం" అర్బన్ కంపెనీ యొక్క ఉద్దేశ్యము.
మీరు చిత్రాన్ని ఈ దిగువ లింక్లో చూడవచ్చు:
పొంగల్: https://www.youtube.com/watch?v=3dlb5V4QmeM
మకర సంక్రాంతి: https://www.youtube.com/watch?v=JuaCZfcmLxs
క్రెడిట్లు:
బ్రాండు: అర్బన్ కంపెనీ
సీనియర్ వైస్ ప్రెసిడెంట్ - మార్కెటింగ్ మరియు గ్రోత్: అభినవ్ త్యాగి
వైస్ ప్రెసిడెంట్ - మార్కెటింగ్: స్మిత్ శుక్లా
సీనియర్ బ్రాండ్ మేనేజర్: శుభీ దాంగి
ఏజెన్సీ: QED కమ్యూనికేషన్స్, గుర్గాంవ్
క్రియేటివ్ డైరెక్టర్: హరిహర్ గోస్వామి
అకౌంట్స్ మేనేజర్: మృణాళినీ డోగ్రా
డైరెక్టర్: మొరార్జీ ఆనంద్
ప్రొడక్షన్ హౌస్: రోజర్ దట్ ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: ప్రసన్న భేండే
నిర్మాత: కిమాయా భేండే