Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24లో భారత వృద్థి రేటు 5.5 శాతానికి పడిపోనుందని హెచ్ఎస్బిసి సెక్యూరిటీస్ అండ్ కాపిటల్ మార్కెట్స్ (ఇండియా) చీఫ్ ఎకనమిస్ట్ ప్రంజుల్ భండారి అంచనా వేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా మందగిస్తుందన్నారు. 2022 మార్చితో ముగిసిన ఏడాదిలో భారత జిడిపి 8.7 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతానికి పరిమితం కావొచ్చని అంచనాలు వెలుపడు తున్నాయి. కాగా 2023-24లో 6 శాతం వృద్థి ఉండొచ్చని ఆర్బిఐ అంచనా వేసింది. దీంతో పోల్చితే లేదా గత ఆర్థికసంవత్సరంతో పోల్చిన జిడిపి భారీగానే తగ్గనుందని హెచ్ఎస్బిసి ఎకనామిస్ట్ అంచనా వేశారు.