Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడి
భువనేశ్వర్ : ప్రభుత్వ రంగంలోని బిఎస్ఎన్ఎల్ వచ్చే ఏడాది 2024లో తన 5జి సేవలను అందుబాటులోకి తేనుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. గురువారం ఆయన ఒడిస్సాలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి ప్రయివేటు టెల్కోల 5జి సేవలను లాంచనంగా ప్రారంభించారు. బిఎస్ఎన్ఎల్ తన 4జి నెట్‌వర్క్‌ను 5జికి ఆధునీకరించేందుకు ఇప్పటికే టిసిఎస్, సి-డాట్‌తో ఒప్పందానికి సిద్దమయ్యిందన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాదిలో దేశ వ్యాప్తంగా 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు.