Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక సహకారం: ఈ కార్యక్రమానికి ఎంపికైన పది మంది గృహిణులు తమ వ్యాపార దక్షతకు అనుగుణంగా వ్యాపార ప్రయాణాన్ని ఆరంభించేందుకు రూ.10,00,000 ఆర్థిక సహకారాన్ని అందుకుంటారు.
నవతెలంగాణ న్యూఢిల్లీ: బ్రిటానియా మారి గోల్డ్ అందుబాటులోకి తీసుకు వచ్చిన మై స్టార్టప్ క్యాంపెయిన్ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా, భారతదేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించేందుకు అనువుగా వారికి ఆర్థిక, కౌశల్యాభివృద్ధిని అందిస్తోంది. ఎన్ఎస్డిసి (NSDC)సహకారంతో సీజన్ 2 క్యాంపెయిన్ 10,000 గృహిణులకు కమ్యూనికేషన్ కౌశల్యాలు, ఆర్థిక సాక్షరతను సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికత (ICT) ద్వారా అందించి, సహకారాన్ని అందించడమే కాకుండా సామాజిక మరియు ఆర్థిక సాధికారతకే మైక్రో ఎంటర్ప్యూనురియల్కు కావలసిన కౌశల్యాలను అందించింది. తన సీజన్ 3లో బ్రిటానియా మారి గోల్డ్ మై స్టార్టప్ క్యాంపెయిన్ గృహిణులకు వారి వ్యాపారాలను విస్తరించేందుకు ఇంటర్నెట్ వినియోగాన్ని అలవర్చుకునేందుకు సహకరించింది. మామ్ప్రెస్సోతో కలిసి నిర్వహించిన ఇండియన్ హోమ్ మేకర్స్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ రిపోర్ట్ 2021 ప్రకారం తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆసక్తి కలిగిన 77% మేర గృహిణులు ఈ ప్రయాణంలో సాంకేతికత ప్రముఖ సాధనంగా పరిగణించారు.
సీజన్ 4 ప్రముఖ అంశాలలో ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ వ్యాపార సాక్షరత కార్యక్రమం గూగుల్ అందిస్తున్న ఉమెన్ విల్ కార్యక్రమం ప్రయోజనాలను అందుకునేందుకు అవకాశం లభిస్తుంది. అందులో వ్యాపారపట్ల ఆసక్తి పెంపొందించే, వ్యాపారాన్ని నిర్వహించే మరియు దాని ప్రగతిని ఉత్తేజించే ‘‘ఎలా’’ అనే పాఠ్యాంశం కూడా ఉంటుంది. ఈ ప్రయాణాన్ని ప్రారంభించే ప్రతి ఒక్కరికీ ప్రమాణ పత్రాన్ని అందిస్తారు.
బ్రిటానియా మారి గోల్డ్ మైస్టార్టప్ పోటీ 4.0 ప్రారంభం గురించి బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ దోషి మాట్లాడుతూ, ‘‘బ్రిటానియా మారి గోల్డ్ పలు దశాబ్దాల నుంచి భారతీయ గృహిణులతో ఆత్మీయ బాంధవ్యాన్ని కలిగి ఉంది. మారి గోల్డ్ మై స్టార్టప్ కార్యక్రమం మూడు విజయవంతమైన సీజన్లను నిర్వహించినందుకు మేము గర్విస్తున్నాము. దీనితో మేము భారతదేశ వ్యాప్తంగా 4 మిలియన్ ఎంట్రీలను మహిళా ఆకాంక్షుల నుంచి పొందగా, అందులో 60% దరఖాస్తులు నాన్-మెట్రో ప్రాంతాల నుంచి వచ్చాయి. ఈ ఏడాది గూగుల్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము మరియు వారి పరిణితితో లక్షలాది మంది పారిశ్రామికవేత్తలు కావాలన్న ఆకాంక్షలు కలిగిన మహిళలకు వారి వ్యాపార దక్షత ప్రయాణంలో సహకరిస్తుండగా, మా ద్వారా నిరంతర మార్గదర్శనం మరియు మద్దతు ద్వారా ప్రజాస్వామ్యీకరణ మరియు సుస్థిరం అయ్యేందుకు సహకరిస్తుంది. మొత్తం మీద మేము పారిశ్రామికవేత్తగా మారాలన్న ఆకాంక్షలు ఉన్న మహిళల కలలకు రెక్కలను కట్టే భరోసాను కలిగి ఉన్నాము’’ అని తెలిపారు.
బ్రిటానియాతో భాగస్వామ్యం గురించి గూగుల్ ఇండియా, గూగుల్ కస్టమర్ సొల్యూషన్స్ డైరెక్టర్ శాలిని పుచ్చలపల్లి, ‘‘వ్యాపారం వృద్ధి చెందేందుకు సాంకేతికత సహకరిస్తుంది- అయితే సరైన కౌశల్యాలను కలిగి, నేతృత్వం వహించే మరియు శ్రమించే ప్రజలకు మాత్రమే ఇది మద్దతుగా ఉంటుంది. ఇది మహిళా పారిశ్రామికవేత్తలు అందరికీ వాస్తవ సహకారాన్ని అందించగా, వారు చిన్న వ్యాపారాలు, క్రియేటర్లు, డెవలపర్లు లేదా స్టార్టప్‌లకు మరియు ఈ సముదాయానికి మా ఉత్పత్తులు మరియు ప్లాట్‌ఫారాల ద్వారా మరియు ఉమెన్ విల్ వంటి కౌశల్య కార్యక్రమాల ద్వారా మద్దతు ఇచ్చేందుకు మా నిబద్ధత ఉంది. మేము కొత్త హోమ్ ప్రీనర్ల సముదాయానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాఠ్యాంశానికి బ్రిటానియా మై స్టార్టప్ పోటీ ద్వారా రెండవ వరుస సీజన్ ద్వారా అందించేందుకు చాలా సంతోషిస్తున్నాము మరియు ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము’’ అన్నారు.