Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలోనే అతిపెద్ద లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ అన్అకాడెమీ* ఇటీవల ప్రకటించిన CLAT పరీక్ష ఫలితాల్లో 70 మంది లెర్నర్లు అర్హత సాధించినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన సాత్విక్ కులపాక, అనాకాడెమీ లెర్నర్, CLAT 2022లో ఆల్ ఇండియా ర్యాంకు 113 సాధించారు.
సాత్విక్ ఎప్పుడూ లాయర్ కావాలని కలలు కనేవాడు. తన కలను నెరవేర్చుకునేందుకు అతను CLATలో చక్కని ర్యాంకు పొందేందుకు అన్‌అకాడెమీలో చేరాడు. అన్అకాడెమీ అతనికి భారతదేశంలోని అగ్రశ్రేణి అధ్యాపకుల నుంచి అవసరమైన మెంటర్‌షిప్‌ను, అతనికి సహాయం చేసేందుకు ఉత్తమ నాణ్యత కలిగిన అధ్యయన మెటీరియల్‌ను అందించింది. పరీక్షా సరళిని సాత్విక్ చక్కగా అర్థం చేసుకునేందుకు, చివరి రోజు వరకు తన సమయాన్ని ఆప్టిమైజ్ చేసుకునేందుకు ప్లాట్‌ఫారమ్‌లో క్రమం తప్పకుండా మాక్ టెస్ట్‌లకు హాజరవుతూ, తనను తాను అంచనా వేసుకుంటూ వచ్చాడు. ఇటీవలి CLAT పరీక్షలో 70 మందికి పైగా అన్అకాడమీ లెర్నర్లు టాప్ ర్యాంకులు సాధించారు మరియు NLUలలో ప్రవేశాలు సాధించారు. వీరిలో 3 మంది లెర్నర్లు 100 లోపు ర్యాంకులు, 9 మంది లెర్నర్లు 200 లోపు, 21 మంది అభ్యాసకులు 500 లోపు టాప్ ర్యాంకులు సాధించారు. బెస్ట్-ఇన్-క్లాస్ ద్వారా ఉన్నత-నాణ్యత కంటెంట్, 1:1 లైవ్ సెషన్లు మరియు కృతి భట్నాగర్, కేశవ్ మల్పానీ, దివ్యకుమార్ గార్గ్ వంటి అగ్రశ్రేణి అధ్యాపకుల నుంచి పర్సనలైజ్ మెంటర్షిప్ వంటి ఆఫర్లు, అన్అకాడమీ లెర్నర్లు తమ విద్యా ప్రయాణంలో రాణించుందక ఒక ప్రసిద్ధ కేంద్రంగా ఉద్భవించింది.