Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జీస్క్వేర్ ఎపిటోమ్ మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ జీస్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీని ప్రారంభించింది. గచ్చిబౌలి సమీపంలోని విజయవాడ జాతీయ రహదారి మార్గంలో దీన్ని అభివృద్థి చేసింది. ఈ ప్రాజెక్టు 1242 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని తెలిపింది. దీనిలో 267 నుంచి 533 చదరపు గజాల విస్తీర్ణంలో 368 ప్రీమియం విల్లా ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసింది. దీనిలో 100 ఎకరాల గోల్ఫ్ కోర్స్, 40 ఎకరాల లగ్జరీ రిసార్ట్, వెల్నెస్ కేంద్రం, స్పోర్ట్స్ అకాడమీ, స్కూల్, కాలేజీ, మరెన్నో ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది.