Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా ఔత్సాహికవేత్తలకు రూ.10 లక్షలు
న్యూఢిల్లీ : బ్రిటానియా మారి గోల్డ్ మై స్టార్టప్ సీజన్ 4.0ని ప్రారం భించినట్లు ప్రకటించింది. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ డిజిటల్ వ్యాపార నైపుణ్యాన్ని అందించేందుకు గూగుల్ సహకారాన్ని అందిస్తోందని పేర్కొంది. దీనికి ఎంపికైన పది మంది గహిణులు తమ వ్యాపార దక్షతకు అనుగుణంగా వ్యాపారాలను ప్రారంభించేందుకు రూ.10 లక్షల ఆర్థిక సహకారాన్ని అందించనున్నట్లు తెలిపింది. గూగుల్ భాగస్వామ్యంతో ఉమెన్ విల్ కార్యక్రమం ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారాలన్న ఆకాంక్ష ఉన్న వారికోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశామని బ్రిటానియా ఇండిస్టీస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ దోషి పేర్కొన్నారు. దీనికి ఎంపికయిన వారు ప్రత్యేకంగా డిజైన్ చేసిన డిజిటల్ బిజినెస్ నైపుణ్యాల వనరులను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.