Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది ఆసియాలోనే అత్యధిక పతనం
- మరింత పడిపోవచ్చు
న్యూఢిల్లీ: గతేడాది 2022 లో ఆసియాలోనే అత్యంత పేల వ ప్రదర్శన కనబర్చిన కరెన్సీ ల్లో రూపాయి అగ్రస్థానంలో ఉందని ఓ ప్రయివేటు బ్యాంక్ టాప్ ఎగ్జి క్యూటివ్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఎకౌంట్ లోటు పెరగనుందని.. దీంతో రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురి కానుందని యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ ట్రెజరీ, హోల్‌సేల్ బ్యాంకింగ్, మార్కెట్స్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ నీరజ్ గంభీర్ విశ్లేషిం చారు. బ్లూమ్‌బర్గ్ టివికి ఇచ్చిన ఇంటర్యూలో గంభీర్ మాట్లాడుతూ.. ''2022-23 ఆర్థిక సంవత్సరంలో విదేశీ నిధుల రాక మెరుగ్గా లేదు. గతేడాది రూపాయి విలువ 10 శాతం మేర పడిపోయింది. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీలో వడ్డీ రేట్ల పెంపునతో డాలర్ విలువ పెరిగడంతో భారత విదేశీ ఫైనాన్స్ క్షీణిస్తుంది. విదేశీ మారకం రిజర్వుల పెంపునకు ఆర్బిఐ చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంది. గతేడాది రూపాయి విలువ పడిపోతుంటే.. దేశీయ కరెన్సీని నిలబెట్టడానికి ఆర్బిఐ భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని వ్యయం చేసింది.'' అని అన్నారు. వచ్చే ఏప్రిల్ 1 నాటికి డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 2-3 శాతం విలువ పడిపోవచ్చని ఆయన అంచనా వేశారు. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.57 వద్ద నమోదయ్యింది. ఆర్బిఐ కీలక వడ్డీ రేట్లను మరో 25-50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని గంబీర్ పేర్కొన్నారు. వచ్చే కొన్ని మాసాల్లో పదేళ్ల కాలపరిమితి బాండ్లపై వడ్డీ రేటు 7.25 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చన్నారు. వాణిజ్యలోటు, కరెంటు ఖాతా లోటు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కరెన్సీ అంతకంతకూ క్షీణిస్తూ వచ్చిందని ఇటీవల ఫారిన్ కరెన్సీ ఎక్సేంజ్ (ఫారెక్స్) ఓ రిపోర్టులో పేర్కొంది. దీంతో 2022 సంవత్సరంలో రూపాయి ఆసియాలోకెల్లా అత్యంత చెత్త కరెన్సీగా మిగిలిపోయిందని తెలిపింది. గరిష్ట వడ్డీ రేట్లు, అధిక ద్రవ్యోల్బణంతో అమెరికా డాలర్ బలపడినప్పటికీ, ఆసియా దేశాల్లో ఏ కరెన్సీ తగ్గనంత తీవ్రంగా రూపాయి 11.3 శాతం మేర పతనమయ్యిందని తెలిపింది. 2021 చివరి ట్రేడింగ్ రోజున డాలరు మారకంతో పోల్చితే రూపాయి విలువ 74.33 వద్దనుండగా.. 2022 చివరి రోజున 82.72కు పడిపోయిందని గుర్తు చేసింది.
రూపాయితో వాణిజ్యం : ఆర్బిఐ గవర్నర్
ఇతర దేశాలతో వాణిజ్యానికి రూపాయితో చెల్లింపుల విషయమై ప్రభుత్వం, ఆర్బిఐ ప్రయత్నిస్తుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఇందుకోసం దక్షిణాసియా దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సదస్సులో శక్తికాంత మాట్లాడుతూ.. దక్షిణాసియాలో ప్రాంతీయ వాణిజ్యం కారణంగా వృద్థి, ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయన్నారు. ఉమ్మడి లక్ష్యాలు, సవాళ్లను ఎదుర్కొనేండుకు కేంద్ర బ్యాంక్‌ల స్థాయిలో పరస్పర సహకారం అందించుకోనున్నట్లు తెలిపారు. అదే విధంగా రూపాయి డిజిటల్ కరెన్సీ అంశంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నామన్నారు.