Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ పారిశ్రామి కవేత్త అయినా జాక్ మా పట్ల యాంట్ గ్రూపు వాటాదారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిన్‌టెక్ సంస్థ యాంట్ గ్రూప్‌పై ఓటింగ్ హక్కుల ను మారుస్తూ కంపెనీ వాటాదారులు నిర్ణయం చేశారు. ఈ మేరకు కంపెనీ వ్యవస్థాపకుడు, మేనేజ్మెంట్, ఉద్యోగుల ఓటింగ్ హక్కుల్లో మార్పులు చేశారు. ఈ నిర్ణయం వల్ల వాటాదారుల ఆర్థిక ప్రయోజనాలకు ఏమాత్రం ఆటంకం ఏర్పడబోతోందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా నిర్ణయంతో జాక్ మా కంపెనీపై తన నియంత్రణను కోల్పోనున్నారు. జాక్ మా చైనా ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా, యాంట్ గ్రూపు వ్యవ స్థాపకులు. 2020 అక్టోబర్‌లో చైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా జాక్‌మా మాట్లాడటంతో ఆయన పతనం మొదలయ్యింది.