Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికన్ కంపెనీల్లోని ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో గతేడాది నుంచి ఉద్వాసనాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా న్యూయార్క్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఈ వారంలో దాదాపు 3,200 ఉద్యోగులకు ఉద్వాసన పలికనుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో అస్థిరత ఫలితంగా కార్పొరేట్ ఒప్పందాల్లో భారీ మందగమనం ఏర్పడింది. ఫలితంగా ఖర్చుల్ని తగ్గించుకునే పేరుతో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసినట్లు సమాచారం. తొలగింపులు ఉంటాయని ఆ కంపెనీ ప్రకటిస్తున్నప్పటికీ.. సంఖ్య చెప్పడంలో, స్పష్టత నివ్వడానికి నిరాకరించింది. సంస్థలోని కోర్ ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్ల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ పేర్కొంది. ప్రస్తుత సిఇఒ డేవిడ్ సోలోమన్ నేతత్వంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2018 నుంచి 34 శాతం పెరిగింది. 2022 సెప్టెంబరు 30 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 49,000కు చేరింది. కంపెనీ నిర్వహిస్తున్న వివిధ వ్యాపారాల్లో ఆదాయాలు పడిపోవడం, బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు అధికంగా ఖర్చు చేయడం సహా ఆర్థిక అస్థిర పరిస్థితుల కారణంగా వ్యయాల్ని నియంత్రించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని కంపెనీ ఇటీవల పేర్కొంది. ఈ పరిణామాల కారణంగా కంపెనీ లాభాలు 46 శాతం పడిపోయిందని సమాచారం. ఈ క్రమంలోనే వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుందని తెలుస్తోంది.