Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ3లో రూ.75 డివిడెండ్
ముంబయి : దేశంలోనే అతిపెద్ద ఐటి సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) తన వాటాదారులకు బంఫర్ డివిడెండ్ ప్రకటించగా.. మరోవైపు ఆ సంస్థలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో కంపెనీ నికర ఉద్యోగుల సంఖ్యలో 2,197 తగ్గారని.. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,13,974గా ఉందని ఆ కంపెనీ తెలిపింది. ఇదే విషయమై రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. గడిచిన పది త్రైమాసికాల్లో కంపెనీ నికర ఉద్యోగుల తగ్గుదల చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. గడిచిన క్యూ3లో కంపెనీ నికర లాభాలు 11 శాతం పెరిగి రూ.10,846 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో రెవెన్యూ 19.1 శాతం వృద్థితో రూ.58,229 కోట్లుగా నమోదయ్యింది. మూడో మధ్యంతర డివిడెండ్ కింద రూ.8 ప్రకటించింది. ప్రతీ ఈక్విటీ షేర్‌పై స్పెషల్ డివిడెండ్ రూ.67ను కలుపుకుని మొత్తం రూ.75 చెల్లించడానికి బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.