Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పాలు, పాల పదార్థాలను విక్రయించే అమూల్‌కు చెందిన మాతృసంస్థ గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోదిని అనుహ్యాంగా తొలగించింది. తక్షణమే సోదిని ఆ హోదా నుంచి తప్పిస్తూ జీసీఎంఎంఎఫ్ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచే తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్‌గా జయన్ మెహతాను నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో సోది కార్యాలయాన్ని సైతం సీల్ చేయడంతో అనేక అనుమానాలకు దారి తీస్తుంది. కాగా అనుహ్యాంగా సోది తొలగింపునకు గల కారణాలను ఫెడరేషన్ వెల్లడించకపోవడం గమనార్హం. 2010 నుంచి అమూల్ ఎండిగా సోథి పని చేస్తున్నారు.