Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తెలంగాణలో ఐదు శాఖలతో తన విస్తరణను చేపడుతున్నట్లు ప్రకటించింది. తన విస్తరణలో భాగంగా, ఈ నెలలో మాదాపూర్, కూకట్పల్లి, ఏఎస్ రావు నగర్ మరియు సికింద్రాబాద్‌లలో బ్యాంకు తన మొదటి నాలుగు నూతన శాఖలను ప్రారంభించనుంది. బ్యాంకుకు 25 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో బ్యాంకు తన ఉనికిని కలిగి ఉండగా, దేశ వ్యాప్తంగా శాఖలతో 71 లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) తన సమగ్ర శ్రేణి బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవల ద్వారా తెలంగాణలో సమగ్ర వృద్ధిని పెంపొందించుకునేందుకు కట్టుబడి ఉంది. మాస్ మార్కెట్ బ్యాంకుగా, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్ మరియు విభిన్న ఆదాయ మార్గాలకు ప్రాధాన్యతనిస్తూ స్థిరమైన మరియు విభిన్నమైన కస్టమర్ బేస్‌ను నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పొదుపు మరియు కరెంట్ ఖాతాలు, డిపాజిట్లతో పాటు గృహాలు మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల కోసం సరసమైన రుణాలతో సహా పలు రకాల ఉత్పత్తులను బ్యాంకు అందిస్తుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, పొదుపు ఖాతాలపై గరిష్టంగా 7.50% మరియు 560 రోజుల పాటు సీనియర్ సిటిజన్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 8.75% వడ్డీ రేటుతో సహా మార్కెట్లో అత్యంత పోటీతో కూడిన వడ్డీ రేట్లను అందించటంలో చక్కని గుర్తింపు దక్కించుకుంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సూక్ష్మ మరియు చిన్న వ్యాపారాల కోసం రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యాపార రుణాలను మరియు రూ.5 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు సరసమైన వడ్డీ ధరలలో గృహ రుణాలను అందిస్తుంది. ఈ రుణాలు వ్యక్తులు మరియు వ్యాపారాలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడం లేదా వారి కలల నివాసాన్ని కొనుగోలు చేయడం/నిర్మించడం వంటి తమ ఆర్థిక లక్ష్యాలను సాధించుకునేందుకు సహాయపడేలా రూపొందించారు.
ఈ సందర్భంగా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ ఇట్టిరా డేవిస్ మాట్లాడుతూ, ‘‘ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తెలంగాణలో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించేందుకు సంతోషిస్తున్నాము. వినూత్న బ్యాంకింగ్ పరిష్కారాలతో పాటు తెలంగాణలోని విభిన్న శ్రేణి వినియోగదారులకు నిబద్ధతతో సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాము. ఈ ప్రాంతంలో మా విస్తరణ ప్రయత్నాలను ప్రోత్సహిస్తూ, రిటెయిల్ డిపాజిట్లను సమీకరించుకునేందుకు మా బ్రాంచ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటూ, సురక్షితమైన మరియు అన్సెక్యూర్డ్ రుణాల సమతుల్య పోర్ట్‌ఫోలియోను నిర్మించే మా వ్యూహంలో భాగంగా, కొనసాగుతున్న విస్తరణ ప్రయత్నాలు మరియు మా బ్రాంచ్ నెట్‌వర్క్‌ను విస్తరించే లక్ష్యంతోనే తెలంగాణలో మేము మా సేవలను సేవలను ప్రారంభించాము’’ అని వివరించారు.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కరోల్ ఫుర్టాడో మాట్లాడుతూ, ‘‘సూక్ష్మ, చిన్న ఎంటర్ప్రైజ్ పరిశ్రమ మరియు సరసమైన గృహాలకు బలమైన వృద్ధి అవకాశం ఉన్న తెలంగాణలో మా కార్యకలాపాలను విస్తరించేందుకు మేము సంతోషిస్తున్నాము. తెలంగాణలోని వివిధ పరిశ్రమల వృద్ధికి తోడ్పడేలా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. పొదుపు మరియు డిపాజిట్లపై పోటీతో కూడిన వడ్డీ ధరలతో సహా మా సమగ్ర శ్రేణి బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవలు, తెలంగాణలోని ఆకాంక్షలు కలిగిన ప్రజలకు సేవ చేయగలమని మేము విశ్వసిస్తున్నాము. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో, ఉద్దేశ్యంతో కూడిన, సమ్మిళిత వృద్ధి ద్వారా సామూహిక మార్కెట్ రంగం సహకారంతో జీవితాను మెరుగుపరచడంపై మా దృష్టి ఉంది’’ అని పేర్కొన్నారు.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గత రెండు త్రైమాసికాల్లో లాభదాయకంగా ఉండటంతో వ్యాపారంలో కీలక ప్రగతి సాధించింది. డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మొత్తం డిపాజిట్లు ఏడాది నుంచి ఏడాదితో పోల్చితే (Y-o-Y) 49% వృద్ధి చెందాయి. రిటెయిల్ డిపాజిట్లో బలమైన ఊపుతో ఇది ఏడాది నుంచి ఏడాదికి (Y-o-Y) 72% పెరిగింది. బ్యాంక్ స్థూల రుణ పుస్తకంలో ఏడాది నుంచి ఏడాదికి (Y-o-Y) 33% ప్రగతితో రుణ మంజూరు ₹4,800 కోట్ల కన్నా ఎక్కువగా ఉంది. సేకరణ సామర్థ్యం 99%+ వద్ద నిర్వహించబడుతూ, పునర్నిర్మించిన ఎన్పీఏ బుక్ ఆరోగ్యకరమైన సేకరణలను చూపుతోంది. పీఏఆర్/జీఎన్‌పీఏ 6.1% త్రైమాసికం నుంచి త్రైమాసికానికి (Q-o-Q) 5.0%కి క్షీణించడంతో ఆస్తి నాణ్యత కూడా మెరుగుపడింది.