Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 637 పాయింట్ల పతనం
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవి చూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 637 పాయింట్లు లేదా 1.04 శాతం పతనమై 60,657కు పడిపోయింది. దీంతో సోమవారం ర్యాలీతో వచ్చిన లాభాలు ఆవిరయ్యాయి. ఎన్ఎస్ఇ నిఫ్టీ 190 పాయింట్లు లేదా 1.04 శాతం తగ్గి రూ.18,043 వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ విలువ రూ.2.02 లక్షల కోట్ల విలువ కోల్పోయి.. రూ.282.64 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. దీంతో రూ.2.02 లక్షల కోట్ల సంపదను ఇన్వెస్టర్లు నష్టపోయినట్లయ్యింది. బీఎస్ఈలోని 3,563 స్టాక్స్ల్లో 2,211 సూచీలు నష్టాలను చవి చూడగా.. 1,206 స్టాక్స్ లాభాలను గడించగా.. 149 స్టాక్స్ యథాతథంగా నమోదయ్యాయి. ంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న అస్థిర పరిస్థితులు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చన్న నిపుణుల అంచనాలు, మాంద్యం భయాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి.