Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రూ.25 కోట్లతో జినోమ్ వ్యాలీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని మెటీయరిక్ బయో ఫార్మాస్యూటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గౌరవ్ కౌశిక్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2023 ముగింపు నాటికి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అహ్మాదాబాద్‌లోని తన ఆర్‌అండ్‌డి సెంటర్‌ను ఇక్కడికి తరలించనున్నామని తెలిపారు. తొలుత 20-25 మంది సైంటిస్టులను తీసుకోనున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థకు 600 మంది క్లయింట్లున్నారన్నారు. 80 దేశాలకు ఎగుమతులు చేస్తున్నామన్నారు. మెటీయిక్ బయోకు 100కు పైగా ఉత్పత్తులు, 10కి పైగా పేటెంట్లు, 50కు పైగా ట్రేడ్ మార్క్లున్నాయన్నారు.