Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్త విస్తరణపై ఫ్రాంక్లిన్ ఇవి దృష్టి
హైదరాబాద్ : విద్యుత్ స్కూటర్ల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఫ్రాంక్లిన్ ఇవి దేశ వ్యాప్త విస్తరణపై దృష్టి పెట్టినట్టు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ ముగింపు కల్లా 200 షోరూంలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించినట్టు ఆ సంస్థ ఫౌండర్ డాక్టర్ శశిధర్ తెలిపారు. హైదరాబాద్లో మంగళవారం ఆ సంస్థ కో-ఫౌండర్లు రంజిత్ కుమార్, నవీన్ కుమార్లతో కలిసి శశిధర్ మీడియాతో మాట్లాడారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి రూ.50 కోట్లు వ్యయం చేయనున్నామని తెలిపారు. తమ సంస్థ హైదరాబాద్, బెంగళూరు, చెన్నరు, వైజాగ్, విజయవాడ వంటి 30 నగరాల్లో మొత్తం 54 షోరూంలను నిర్వహిస్తోన్నామన్నారు. ఒక్క హైదరాబాద్లోనే 14 షోరూంలు కలిగి ఉన్నామన్నారు. రెండేళ్లలోనే 6వేల పైగా వినియోగదారులను సొంతం చేసుకున్నామన్నారు. కొత్తగా ఫ్రాంచైజీ కోసం 30 మంది ఔత్సాహికులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్రికాకు ఎగుమతులు చేస్తున్నామన్నారు.