Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిలయన్స్, లోహియా, సుప్రీమ్, మమత, ఎక్స్‌కాన్ , హెచ్ఎంఈఎల్, ఐఓసీఎల్, స్టార్లింగర్, డబ్ల్యు అండ్ హెచ్ వంటి భారతీయ కంపెనీలతో పాటుగా జర్మనీ, ఆస్ట్రియా, సింగపూర్, జపాన్, వంటి దేశాల నుంచి ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు
న్యూఢిల్లీ : ప్లాస్టిక్స్ రంగంలో శ్రేష్టత కోసం కృషి చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్లాస్ట్ ఇండియా సంస్ధ, 11వ ఎడిషన్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్, కన్వెన్ఫన్ – ప్లాస్ట్ ఇండియా 2023 ను 01 ఫిబ్రవరి నుంచి 05 ఫిబ్రవరి 2023 వరకూ నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్లాస్ట్ ఇండియా జరుగనుంది. ఆసియాలో అతిపెద్ద ప్లాస్టిక్ ఎగ్జిబిషన్‌గా గుర్తింపు పొందిన ప్లాస్ట్ ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా 1800 మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు జిగేష్ దోషి మాట్లాడుతూ ‘‘ ప్లాస్ట్ ఇండియా 2023ను నిర్వహిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మహమ్మారి కారణంగా దాదాపు నాలుగు సంవత్సరాలు ఈ ప్రదర్శనకు దూరమైనప్పటికీ ఈసారి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ పరిశ్రమ నిపుణులు మరోమారు ప్లాస్టిక్, పాలిమర్ పరిశ్రమ కోసం తగిన పరిష్కారాలను అందించడానికి ఒకే దరికి రాబోతున్నారు. ఈ భారీ ఎగ్జిబిషన్, ప్లాస్టిక్స్‌కు సంబంధించి అంతర్జాతీయంగా నిర్వహిస్తోన్న అతి పెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలువనుంది’’ అని అన్నారు.
ప్లాస్ట్ ఇండియా 2023 నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ అజయ్ షా మాట్లాడుతూ ‘‘ ప్లాస్ట్ ఇండియా ఇప్పుడు ఓ అంతర్జాతీయ అనుభవంగా మారింది. ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ ప్రక్రియలు, ప్రాసెసర్లుతో పాటుగా ప్లాస్టిక్స్ వినియోగదారులు, ప్లాస్టిక్ రీసైకిలర్లు సైతం పాలుపంచుకోనున్నారు. ప్లాస్టిక్ పరిశ్రమలో ఉన్నవారు ఈ ప్రదర్శనను అసలు మిస్ కాకూడదు’’ అని అన్నారు.