Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సాంకేతిక రంగంలో మహిళలు, పురుషులతో పోటీ పడుతున్నారు. తామూ పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. అలాంటి కోవలోకి చెందినదే 450 మందికి పైగా నిపుణులతో బలంగా ఎదిగిన అనలిటిక్స్ డేటా ఇంజనీరింగ్ కంపెనీ మోదక్. మోదక్ సహ వ్యవస్థాపకురాలు ఆర్తి జోషి ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ బిజినెస్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్ నార్సింగిలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఆమెకు అవార్డును అందజేశారు. ఈ అవార్డుకు ఎంపికైన 20 మంది వ్యాపార మహిళల్లో ఆమె ఒకరు. ఈ కార్యక్రమంలో నిటిఅయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.