Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.210 కోట్లతో వాటర్ హీటర్ల ఉత్పత్తి
హైదరాబాద్ : జడ్చర్లలో వాటర్ హీటర్ల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్టు హింటాస్టిక్ ప్రయివేటు లిమిటెడ్ (హెచ్పీఎల్) తెలిపింది. హింద్వేర్ గ్రూపు, అట్లాంటిక్ కంపెనీలు సంయుక్తంగా హెచ్పీఎల్ను ఏర్పాటుచేశాయి. దాదాపు 5.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.210 కోట్ల తొలి పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ కేంద్రంలో ఆరు లక్షల యూనిట్ల వాటర్ హీటర్లు, హీటింగ్ అప్లయెన్సస్ను తయారుచేసే సామర్ధ్యం ఉందని హింద్వేర్ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ చైర్మెన్ సందీప్ సోమానీ తెలిపారు. అట్లాంటిక్ గ్రూపు సీఈఓ పియర్రీ లూయిస్ ఫ్రాన్కోయిస్, భారత్లో ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ట్రేడ్ కమిషనర్ ఎరిక్ ఫాజోల్తో కలిసి సందీప్ సోమానీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ తయారీ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయన్నారు. ఇది అత్యాధునిక ఇంధన పొదుపు తయారీ యంత్రసామాగ్రి, పునరుత్పాదక విద్యుత్ వనరులను వినియోగించుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హింద్వేర్కు ఇది 9వ ఫ్యాక్టరీ అని తెలిపారు. కొత్త ప్లాంట్లోని ఉత్పత్తుల్లో 30 శాతం ఎగుమతులు ఉండొచ్చన్నారు.