Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరుసగా మూడో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూశాయి. అంతర్జాతీయంగా పలు సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ గురువారం సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలు చవి చూశాయి. అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ 147 పాయింట్లు లేదా 0.25 శాతం తగ్గి 59,958కి పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 17,858 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసిజి, బ్యాంకింగ్ సూచీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగిస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. పేటియంలోని 2 కోట్ల షేర్లను యాంట్ ఫైనాన్సీయల్ గ్రూపు విక్రయించిదన్న రిపోర్టులతో పేటియం షేర్లు ఓ దశలో ఏకంగా 9 శాతం మేర నష్టపోయి.. తుదకు 6.21 శాతం పతనంతో 543 వద్ద ముగిసింది.