Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 2022-23 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో నిపుణుల అంచనాలు మించి మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించింది. గడిచిన క్యూ3లో కంపెనీ రెవెన్యూ రికార్డ్ స్థాయిలో 20.2 శాతం పెరిగి రూ.38,318 కోట్లకు చేరింది. ఇంతక్రితం ఏడాది త్రైమాసికంలో 31,867 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది. క్రితం క్యూ3లో కంపెనీ నికర లాభాలు 13.4 శాతం వృద్ధితో రూ.6,586 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో కొత్తగా 3.3 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులను పొందినట్లు తెలిపింది. 2022 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది మాసాల్లో రూ.9.4 శాతం వృద్థితో రూ.17,967 కోట్ల నికర లాభాలు సాధించినట్లు వెల్లడించింది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.16,425 కోట్ల లాభాలు ఆర్జించింది. గురువారం బిఎస్ఇలో ఇన్ఫోసిస్ షేర్ విలువ 0.62 శాతం పెరిగి రూ.1,480 వద్ద ముగిసింది.