Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ4లో 28% పతనం
- తయారీ పరిశ్రమపై సంక్షోభం దెబ్బ
- 2023 గడ్డుకాలమే
న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థల తీరుకు ఇప్పుడు ప్రమాణికంగా భావిస్తున్న పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) అమ్మకాలు భారీగా పడిపోతున్నాయి. గతేడాది నాలుగు త్రైమాసికాల్లోనూ వరుసగా విక్రయాలు తగ్గాయని ఐడీసీ, గార్టినర్, కానలిస్ గణంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా 2022 డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో పీసీ అమ్మకాలు ఏకంగా 28 శాతం తగ్గాయని ఐడీసీ పేర్కొనగా.. 28.5 శాతం క్షీణించాయని గార్టినర్, 29 శాతం పతనమయ్యాయని కానలిస్ వేరు వేరు రిపోర్టులో తెలిపాయి. విండోస్, మాక్ఓఎస్, క్రోమె ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పని చేసే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లను ఇందులో పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. క్యూ4లో దాదాపు 6.5 కోట్ల యూనిట్ల అమ్మకాలు జరిగాయని ఆయా సంస్థలు అంచనా వేశాయి. ఏడాదికేడాదితో పోల్చితే 2022లో పీసీ అమ్మకాలు 16శాతం క్షీణించి.. 28.62 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయని ఐడీసీ అనలిస్ట్ రియన్ రెయిత్ వెల్లడించారు. 2021లో చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో పీసీ అమ్మకాలు జరిగాయన్నారు. కంప్యూటర్ల తయారీలో టాప్ 3 కంపెనీలుగా ఉన్న డెల్ అమ్మకాలు క్యూ4లో 37 శాతం. హెచ్‌పీ విక్రయాల్లో 29 శాతం, లెనెవో అమ్మకాలు 28 శాతం చొప్పున క్షీణించాయి. ఇంత భారీగా తగ్గిపోవడం తాము ఎప్పుడూ చూడలేదని గార్టినర్ పేర్కొంది. 1990 తర్వాత అమ్మకాల్లో ఇంత భారీ పతనం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి అని అభిప్రాయపడింది. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న సంక్షోభ చాయలకు తోడు ఉద్యోగాల తొలగింపు, కొత్త నియామాల్లో పతనం, అధిక ద్రవ్యోల్బణంతో ఖర్చులు పెరగడం తదితర పరిణామాలు పీసీ అమ్మకాలను దెబ్బతీశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.